సాయంత్రం అయిందంటే వీధుల్లోకెళ్లి ఏదొక స్నాక్స్ తినడం చాలా మందికి అలవాటు. రోజు క్రమం తప్పకుండా వెళ్లి తినేవారు చాలా మంది ఉన్నారు. రుచికి బాగుండటంతో వాటికే అలపడి రోజూ కడుపులో పడేస్తారు. అయితే.. ఆ స్నాక్స్ తింటే మన ప్రాణానికి ప్రమాదమని మీకు తెలుసా..! ఎందుకంటే వాటిల్లో ఉండే.. సంతృప్త కొవ్వులు, చక్కెర, లవణాలు , శుద్ధి చేసిన పిండి కారణంగా అవి చాలా అనారోగ్యకరమైనవి. స్నాక్స్ తినడం వల్ల.. జీర్ణ సమస్యలు, గుండె ప్రమాదం,…
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, అన్ని అవయవాలు మెరుగైన ఆక్సిజన్ పొందడానికి.. శ్వాసక్రియకు సహాయపడే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం చాలా ముఖ్యం. ప్రస్తుత కాలంలో.. చాలా మంది తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా అలాంటి సమస్యల బారిన పడినట్లయితే.. సమయానికి నిపుణుల నుండి సలహా తీసుకోండి. లేదంటే.. ఇది తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా మధుమేహం తీవ్ర ఆరోగ్య సమస్యగా మారుతుంది. పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే చిన్నప్పటి నుండే దీని నివారణ గురించి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి.. జీవనశైలి, ఆహారం రెండూ చాలా ముఖ్యం అని వైద్యులు అంటున్నారు. ఇందులో డైట్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. మీరు తినేవి.. తిననివి మీ చక్కెర స్థాయిలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.
వయసు పెరిగే కొద్దీ కీళ్లు, ఎముకల నొప్పుల సమస్యలు అధికమవుతాయి. 50 ఏళ్లలోపు వ్యక్తులలో కూడా ఆర్థరైటిస్ ప్రమాదం పెరుగుతుంది. ఈ సమస్య కారణంగా.. నడవడం, సాధారణ పనులు చేయడం కష్టమవుతుంది. కీళ్ల నొప్పులు.. పురుషులు, మహిళలు ఇద్దరికీ వస్తాయి. మహిళలకు గర్భధారణ, రుతువిరతి సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా మహిళలకు కీళ్ల నొప్పుల సమస్య వచ్చే అవకాశ ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవనశైలి, ఆహారం రెండూ సరిగ్గా ఉండటం అవసరం. వేగంగా పెరుగుతున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఊబకాయం ప్రధాన కారణం. అధిక బరువు వల్ల మధుమేహం, రక్తపోటు, కాలేయం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రోజుల్లో పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ బరువు పెరుగుట సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా…
గోధుమ పిండితో తయారు చేసిన చపాతీ భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. చాలా మంది చపాతీని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. బరువు పెరగడం లేదా తగ్గడం విషయానికి వస్తే.. గోధుమ రొట్టె వినియోగం ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే ప్రశ్న తరచుగా ప్రజల మనస్సులో తలెత్తుతుంది. ఇది బరువును పెంచుతుందా లేదా బరువు తగ్గడంలో సహాయపడుతుందా..?
భారతీయ ఆహారంలో అన్నం ఒక ముఖ్యమైన భాగం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దీనిని అనేక రకాలుగా తింటారు. కానీ అన్నం వినియోగానికి సంబంధించి, అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా.. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి లేదా బరువును నియంత్రించుకోవడానికి ప్రజలు తరచుగా అన్నం తినడం మానేస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. ప్రస్తుతం 5,500పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు అవగా.. ఇక, హైదరాబాద్ లో 2148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్ గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు.
ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి సహజం. రోజూ ఆఫిసుల్లోనూ.. ఇంట్లోనూ పలు సందర్భాల్లో ఒత్తిడికి గురవుతుంటాం. ఒత్తిడి మానసిక ఆరోగ్యానికి చాలా హానికరం. శృతి మించితే ఒత్తిడి ప్రమాదమం.. కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మం, ముఖంపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖంపై ముడతలు పడటం, చర్మం వదులుగా ఉండటం.. ముఖం మెరుపు కోల్పోవడం వృద్ధాప్యానికి సంబంధించిన స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందు కోసం కెమికల్ అధికంగా ఉండే క్రీములు, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే వీటిల్లో ఉండే రసాయనాలు, నిషేధిత పదార్థాల వల్ల దీర్ఘకాలంలో శరీరంలో అనేక రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.