రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలుసుకునే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా నేడు ములుగులో మంత్రి హరీశ్‌రావు ఈ సర్వేను మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 18 ఏండ్లు నిండిన 7 లక్షల మందికి పలు రకాల వైద్య పరీక్షలు చేయబోతున్నారు. ఇందుకోసం ములుగు జిల్లాలో 153 హెల్త్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సర్వే ప్రక్రియను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి పలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12: 30 గంటలకు వేములవాడ టౌన్ తిప్పాపురం 100 పడకల ఆసుపత్రి, హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఆక్సిజన్ ట్యాంక్, సీటీ స్కాన్, పల్లీయేటివ్ కేర్ సెంటర్, పీఎస్ఏ ప్లాంట్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. అంతేకాకుండా పిడియాట్రిక్ వార్డ్ ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడ పట్టణంలో టీయూఎఫ్ఐడిసి…