రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి పలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12: 30 గంటలకు వేములవాడ టౌన్ తిప్పాపురం 100 పడకల ఆసుపత్రి, హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఆక్సిజన్ ట్యాంక్, సీటీ స్కాన్, పల్లీయేటివ్ కేర్ సెంటర్, పీఎస్ఏ ప్లాంట్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. అంతేకాకుండా పిడియాట్రిక్ వార్డ్ ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడ పట్టణంలో టీయూఎఫ్ఐడిసి నిధులు రూ. 20 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 3 గంటలకు వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ కు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3: 30 గంటలకు వేములవాడ మండలం మర్రిపల్లిలో రైతువేదిక, కేజీబీవీ నూతన భవనం ప్రారంభోత్సవాలు ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి చేయనున్నారు.