KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ హస్పటల్ కి వెళ్లారు. కేసీఆర్ తో ఆసుపత్రికి కేటీఆర్, హరీష్ రావు వచ్చారు. అయితే, నిన్న కొన్ని టెస్టుల తర్వాత ఈ రోజు మరోసారి ఆసుపత్రికి వెళ్లారు కేసీఆర్.
‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు మా అసోసియేషన్ సభ్యుల కోసం ఒక బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. ‘మా’ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ‘మా’ సభ్యులకు హెల్త్ చెకప్ జరిపించారు. ఈ హెల్త్ చెకప్ లో 200 మంది సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్ చేశారు వైద్యులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ “‘మా’ సభ్యులకు ఏఐజీ వారు…
సూపర్ స్టార్ రజినీ కాంత్ మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గత కొన్నిరోజుల క్రితం ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరిన తలైవా పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగివచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత షూటింగ్ లో కూడా పాల్గొనడం, ఇటీవలే ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అత్యున్నత ఫిల్మ్ పురస్కారం దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకోవడంతో తలైవా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సమయంలో రజినీ హాస్పిటల్…
సూపర్ స్టార్ రజనీకాంత్ సడెన్ గా అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రజనీ అనారోగ్యానికి గురయ్యారని ఈ కారణంగానే అత్యవసరంగా ప్రత్యేక విమానంలో అమెరికా బయల్దేరారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆయన సాధారణ మెడికల్ చెకప్స్ కోసం అమెరికా వెళ్లారని తెలుస్తోంది. ఈమధ్య ఆయన అనారోగ్యానికి సంబంధించి వార్తలు వస్తుండటంతో.. రజనీ సడన్ గా అమెరికా వెళ్లడంతో ఆయన అభిమానులు కంగారు పడ్డారు. కరోనా పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలపై…
సీఎం కేసీఆర్ కి సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో సిటి స్కాన్ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సీఎం కెసిఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం.వి. రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఊపిరితిత్తులు సాధారణంగా వున్నాయని, ఎటువంటి ఇన్పెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలను సేకరించారు. రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రేపు రానున్నాయి. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా వుందని, త్వరలో…