శీతాకాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే.. రోగనిరోధక శక్తి వేగంగా బలహీనమైపోతుంది. ఈ క్రమంలో.. ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారు. చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా.. జీవనశైలిలో మార్పులు, చల్లని వాతావరణానికి దూరంగా ఉండాలి. రోగనిరోధక శక్తి కారణంగా వల్ల జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. అయితే.. మీరు చల్లని వాతావరణంలో మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ప్రతిరోజూ బొప్పాయిని తినండి.…
శీతాకాలంలో తాజా, ఆరోగ్యకరమైన పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. చలికాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో జామపండు ఒకటి. దీనిని సామాన్యంగా చాలా మంది తింటుంటారు. అయితే.. చలికాలంలో జామ పండును జ్యూస్ చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
చలికాలం వచ్చిదంటే ముఖ్యంగా వేధించే సమస్య పెదవులు పగలడం, కాళ్లు చేతులు పగులుతాయి. చలి కాలంలో అనేక రకాల సమస్యలు తరచుగా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తాయి. జలుబు, ఇతర ఆరోగ్య సమస్యలే కాకుండా.. చర్మం, జుట్టు సంబంధిత సమస్యలు కూడా ఈ సీజన్‌లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తాయి. శీతాకాలంలో చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.. చలికాలంలో గాలిలో తేమ ఉండదు.
చలికాలంలో మీ పిల్లలు ఆహారం తినడం లేదా..? ఒక పక్క సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతూ.. ఆహారం తినడానికి ఇష్టపడరు. చలికాలంలో జలుగు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు పిల్లలతో పాటు పెద్దలను కూడా ఇబ్బందికి గురి చేస్తాయి. ఇలాంటి సమయంలో పిల్లలకు క్యారెట్‌తో తయారు చేసిన వంటకం ఆరోగ్య పరంగా మంచిది. ఇది రుచితో పాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మార్‌బర్గ్ వైరస్‌లోని ‘బ్లీడింగ్ ఐ’ రకం వైరస్ సోకి రువాండాలో ఇప్పటివరకు 15 మంది చనిపోయారు. అలాగే.. చాలా మందికి ఈ వైరస్ సోకింది. ఈ 'బ్లీడింగ్ ఐ' వైరస్ తీవ్రమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వైరస్ ఎక్కువైతే కళ్ళు, ముక్కు లేదా నోటి నుండి రక్తస్రావం అవుతుంది.
దీర్ఘకాల నొప్పి, ఎముకల సమస్యలు చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. చలి కాలంలో ఎండలో తక్కువగా గడుపుతాం. ఈ క్రమంలో.. శీతాకాలంలో విటమిన్ డి లోపం సర్వసాధారణం అవుతుంది. శరీరంలో విటమిన్ డి సరఫరా చేయడానికి సూర్యకాంతి చాలా అవసరం.
కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి.. అనేక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, హైడ్రేషన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే.. చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు అనుకుంటారు. కానీ కొబ్బరి నీళ్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
జీలకర్రను వంటకాల్లో ఎక్కువగా వాడుతాం. ఇది వంటకాల్లో రుచిని అందిస్తుంది. అంతేకాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జీలకర్రతో తయారు చేసిన నీరు తాగితే బరువు తగ్గుతారు. జీలకర్రలో అనేక గుణాలు ఉంటాయి. ఇవి శరీర జీవక్రియను పెంచి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ క్రమంలో బరువు తగ్గడంలో సహాయపడతాయి.
పుట్టగొడుగులు అన్ని సీజన్లలో మార్కెట్లో లభిస్తాయి. కానీ చలికాలంలో వీటిని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. పుట్టగొడుగు ఒక రకమైన ఫంగస్.. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులు తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.. అంతేకాకుండా అనేక వ్యాధులను కూడా నివారిస్తుంది. ఇవి తింటే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా.. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అందుకే బాదం పప్పును సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. బాదంపప్పులో ఉండే పోషకాలు, విటమిన్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి.