Pregnancy Time: గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డలిద్దరికి ఆరోగ్యకరమైన ఆహారం అత్యంత ముఖ్యమైంది. కొన్ని పండ్లు సాధారణంగా ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడినా గర్భిణీ స్త్రీలు వాటిని తీసుకుంటే అవి హానికరంగా మారవచ్చు. ఈ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే, కొన్ని పండ్లు గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని, బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు. ఇప్పుడు అలాంటి పండ్లి ఏంటో ఒకసారి తెలుసుకుందామా.. Also Read: Venkatesh Prasad: టాప్-5 భారతీయ క్రికెటర్లలలో కోహ్లీ, రోహిత్, ధోనిలకు…
Pune: మహారాష్ట్ర పూణేని గుల్లెయిన్-బారే సిండ్రోమ్(GBS) వ్యాధి కలవరపెడుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 54 కేసులు నమోదైనట్లు పూణే డివిజనల్ కమిషనర్ డాక్టర్ చంద్రకాంత్ పుల్కండ్వర్ తెలిపారు. మరో నలుగురికి ఈ అరుదైన నాడీ రుగ్మత ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పూణే మున్సిపల్ కార్పొరేషన్‌లో 24 మందికి జీబీఎస్‌తో బాధపడుతున్నట్లు పలు ఆస్పత్రులు నివేదించిర తర్వాత, డాక్టర్ పుల్కండ్వర్ రాష్ట్ర, జిల్లా ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వహించారు.
మద్యం పానం ఆరోగ్యానికి హానికరం.. అని ఎన్ని సార్లు చెప్పినా కొంత మంది పెడచెవిన పెడతారు. అయితే.. మద్యం తాగిన తర్వాత అది నేరుగా పొట్టలోకి వెళ్లి మూత్రం రూపంలో శరీరాన్ని వదిలి వెళుతుందని చాలా మంది భావిస్తారు. అది శరీరంలోకి వెళ్లిన తర్వాత అవయవాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. ఎంత తాగుతున్నారు? ఎప్పుడు తాగుతున్నారు? ఎంత కాలం నుంచి తాగుతున్నారు? అన్న విషయాలను పక్కన పెడితే ఆల్కహాల్…
మాంసం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. చికెన్, మటన్, ఫిష్, సీ ఫుడ్ అని రకరకాలుగా వండుకుని తింటారు. అయితే ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్ అయిన అందులో నిమ్మకాయ మాత్రం పిండుకోకుండా ఉండలేరు. కొంతమందికి ఆనియన్, నిమ్మకాయ లేనిదే ముద్ద దిగదు. అయితే నాన్ వెజ్‌పై నిమ్మరసం కలిపి తినడం మంచిదేనా? తెలుసుకుందా. * రెస్టారెంట్లలో చికెన్, మటన్, ఫిష్ తినేటప్పుడు, నిమ్మరసాన్ని ముక్కలపై పిండుకోని తినడం ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెబుతున్నారు. వంట…
Dallewal Health Update: పంజాబ్- హర్యానా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష (70) ఈరోజు (జనవరి 6) 42వ రోజుకు చేరుకుంది. దల్లేవాల్ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన సారథ్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా తీవ్ర ఆందోళన చెందుతుంది.
రాను రాను మానవ జీవన విధానం మారుతోంది. ఇది మనిషి జీవనశైలి, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం చూపుతోంది. ఇప్పుడు వయసులో ఉన్న చాలా మంది యువకులకు కనీసం సత్తువ తక్కువవుతోంది. మన తాతల కాలంలో ఒంటి చేస్తో 50 కేజీల వడ్ల బస్తా మోసే వాళ్లు. అలాంటి పరిస్థితి ఇప్పటి జనరేషన్ వాళ్లలో కనిపించడం లేదు. కాగా.. అయిదు పదుల వయసులు ఓ మహిళ సంచలనం సృష్టించింది.
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోనియా చికిత్స పొందుతున్నారు. తల్లి సోనియా వెంట ప్రియాంకాగాంధీ ఉన్నారు.
భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో.. ఆయన థానేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల కాంబ్లీ రమాకాంత్ అచ్రేకర్ మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ను కూడా కలిశాడు. కాగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.