HCA: హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీపై ఉప్పల్ పీఎస్‌లో కేసు నమోదు!
- హెచ్‌సీఏ కమిటీ సభ్యులపై కేసు నమోదు
- డబ్బులు డిమాండ్ చేశారని ప్లేయర్స్ తల్లిదండ్రులు ఫిర్యాదు
- సమగ్ర విచారణ జరపాలని కోరిన ప్లేయర్స్ తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కమిటీ సభ్యులపై కేసు నమోదైంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సందీప్ రాజన్, సందీప్ త్యాగిలు డబ్బులు డిమాండ్ చేశారని ఇద్దరు ప్లేయర్స్ తల్లిదండ్రులు ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అండర్ 19, అండర్ 23 లీగ్‌లలో ఆడించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వనందుకు మంచి ప్రదర్శన చేసినా తన కుమాడిని ఆడనివ్వలేదని, సెలక్షన్ కమిటీపై చర్యలు తీసుకోవాలని ఓ ప్లేయర్ తండ్రి డాక్టర్ రామారావు కోరారు. మరో ప్లేయర్ తండ్రి కె.అనంతా రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు.
Also Read: Bihar Election 2025: జేడీయూ తొలి జాబితా విడుదల.. అనంత్ సింగ్‌తో సహా 57 మంది పేర్లు!
Also Read
ఇటీవల హెచ్‌సీఏ ప్రకటించిన అండర్-19 వినూ మన్కడ్ ట్రోఫీకి ఆడే జట్టులో నిర్దిష్ట వయసు మించిన వారు, తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి హెచ్‌సీఏ లీగ్స్ ఆడుతున్నారని అనంతా రెడ్డి, రామారావు ఆరోపించారు. క్రికెటర్లు అడ్డదారిలో హెచ్‌సీఏ లీగ్‌ల్లో ఆడుతూ రాష్ట్ర జట్లలో స్థానం సంపాదిస్తున్నారని పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 38 మంది క్రికెటర్లు తప్పుడు పత్రాలతో హెచ్‌సీఏ లీగ్‌ల్లో ఆడుతున్నారని.. సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఇందుకు సహకరిస్తున్న హెచ్‌సీఏ పెద్దలపై కూడా కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో అనంతా రెడ్డి, రామారావు పేర్కొన్నారు. గతేడాది తప్పుడు పత్రాలు సమర్పించిన ఆరుగురిపై హెచ్‌సీఏ నిషేధం విధించింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!