ఇండియా క్రికెట్‌లో అన్ని రాష్ట్రాల అసోసియేషన్లు తమ ప్లేయర్ల కోసం లీగ్స్ నడిపిస్తున్నాయి. కొత్త టాలెంట్‌ను బయటికి తీయడంలో ఈ లీగ్స్ ఉపయోగపడుతాయి. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాత్రం అందుకు భిన్నం. ఇక్కడ లీగ్ పక్కన పెడితే కనీసం వివాదం లేకుండా.. ఈ అసోసియేషన్‌ని రన్ చేయలేరు. ఇప్పటికే ఎన్నో వివాదాలతో పరువు పోగొట్టుకున్న హెచ్‌సీఏ.. ఇప్పుడు మరో వివాదంలో నిలించింది.
Also Read: Afghanistan Cricket: చరిత్ర సృష్టించిన ఆఫ్గనిస్తాన్.. ప్రపంచంలోనే మొదటి టీమ్!
కొత్తగా హెచ్‌సీఏతో పాటు పలువురు ప్లేయర్సపై అనంత్ రెడ్డి అనే వ్యక్తి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. అండర్ 16, అండర్ 19, అండర్ 23 లీగ్ మ్యాచుల్లో పలువురు ఫేక్ ప్లేయర్స్ ఉన్నారని కంప్లైంట్ ఇచ్చారు. ఆయా విభాగాల్లో స్థానం పొందేందుకు పలువురు ప్లేయర్లు నకిలీ బర్త్ సర్టిఫికెట్లు సమర్పించారని తెలిపారు. హెచ్‌సీఏ నిర్లక్ష్యంతో ఎక్కువ వయసు ఉన్న ప్లేయర్లు లీగ్‌లో ఎంట్రీ ఇస్తున్నారని అనంత్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు గతంలో ఆరుగురు ప్లేయర్స్‌ను గుర్తించి బీసీసీఐ బ్యాన్ విధించిందని గుర్తు చేశారు. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ తక్కువ ఏజ్ లీగ్‌లో అడేలా హెచ్‌సీఏ అవకాశమిస్తోందని ఆరోపించారు. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు నష్టం జరిగేలా హెచ్‌సీఏ వ్యవహరిస్తుందని అనంత్ రెడ్డి మండిపడ్డారు.