టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ చాలా సందర్భాల్లో జట్టును గెలిపించాడు. ఐసీసీ టోర్నీల్లో కూడా టీమిండియాకు మంచి ప్రదర్శన చేసాడు. తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయాలలో కూడా కీ రోల్ పోషించాడు. అయితే తన క్రికెట్ కేరీర్ బాగానే వున్నా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు వున్నాయి.ముఖ్యంగా భార్యతో విడాకులు గొడవ తనను కృంగదీసింది. ఇప్పుడు అదే విషయంలో షమీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. మొహమ్మద్ షమీ, తన…
భారత క్రికెట్ జట్టులో షమీ తన సత్తాను నిరూపించుకుంటున్న సమయంలో.. అతని విడిపోయిన భార్య హసిన్ జహాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. మహమ్మద్ షమీ మంచి వ్యక్తే అయితే.. తాము మంచి జీవితాన్ని గడిపేవాళ్లమని జహాన్ తెలిపింది. అతను మంచి వ్యక్తి అయితే తన కూతురు, తన భర్త, తాను సంతోషకరమైన జీవితాన్ని గడిపేవాళ్లమని పేర్కొంది. అతను మంచి ఆటగాడు మాత్రమే కాకుండా.. మంచి భర్త, మంచి తండ్రిగా కూడా ఉంటే అది మరింత గౌరవంగా ఉండేదని…
Mohammed Shami gets bail in Domestic Violence Case: స్వదేశంలో త్వరలో ఆరంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కు ముందు భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి ఊరట లభించింది. షమీ భార్య హసిన్ జహాన్ పెట్టిన గృహ హింస కేసులో అలీపూర్ కోర్టు అతడికి రెండు వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. షమీ మంగళవారం కోల్‌కతాలోని అలీపూర్ ఏసీజేఎం కోర్టుకు భౌతికంగా హాజరై బెయిల్ తీసుకున్నాడు. షమీతో పాటు అతని…
Team India: టీమిండియా బౌలర్ మహ్మద్ షమీకి కోల్‌కతా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నాలుగేళ్ల కిందట షమీపై అతడి భార్య హసీన్ జహాన్ గృహహింస కేసు పెట్టడంతో పాటు కోల్‌కతా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. షమీ నుంచి విడిపోవాలనుకుంటున్నానని, తనకు నెలవారీ భరణం ఇప్పించాలని పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌పై కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. హసీన్ జహాన్‌కు నెలవారీగా రూ.50 వేలు భరణం చెల్లించాల్సిందిగా షమీని కోర్టు ఆదేశించింది. గతంలో షమీ తనను హింసించేవాడని…