Mohammed Shami Bail: భారత క్రికెటర్ మహ్మద్ షమీకి బెయిల్ మంజూరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Shami gets bail in Domestic Violence Case: స్వదేశంలో త్వరలో ఆరంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కు ముందు భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి ఊరట లభించింది. షమీ భార్య హసిన్ జహాన్ పెట్టిన గృహ హింస కేసులో అలీపూర్ కోర్టు అతడికి రెండు వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. షమీ మంగళవారం కోల్‌కతాలోని అలీపూర్ ఏసీజేఎం కోర్టుకు భౌతికంగా హాజరై బెయిల్ తీసుకున్నాడు. షమీతో పాటు అతని సోదరుడు మహ్మద్ హసీమ్‌కు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
2018లో జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో మహ్మద్ షమీతో పాటు అతడి సోదరుడు మహ్మద్ హసీమ్‌పై హసిన్ జహాన్ ఫిర్యాదు చేసింది. షమీ, అతడి కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని.. షమీ వివాహేతర సంబంధం కూడా కలిగి ఉన్నాడని జహాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. జహాన్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా.. షమీ మరియు అతని కుటుంబ సభ్యులలో కొందరిపై కేసు నమోదైంది. ఇక 2019 ఆగస్టు 29న అలీపూర్ అడిషినల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇక సెప్టెంబర్ 9న కోల్‌కతా కోర్టు ఆ అరెస్ట్ వారెంట్‌పై స్టే విధించింది.
Also Read
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
Also Read: Rohit Sharma: అభిమానుల కోసం కారు దిగిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్!
2023 జనవరిలో హసిన్ జహాన్‌కు నెలవారీ పరిహారంగా రూ. 50 వేలు చెల్లించాలని భారత పేసర్ మొహ్మద్ షమీని అలీపూర్ కోర్టు ఆదేశించింది. ఇక షమీపై ఉన్న స్టేను ఎత్తివేయాలని జహాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హసిన్ ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 23న అలీపూర్ అదనపు సెషన్స్ జడ్జి షమీకి సమన్లు జారీ చేయడం వెనుక సరైన కారణం కనిపించలేదని ఆదేశించారు. ఈ కేసులో సెప్టెంబర్ 19న కోర్టుకు హాజరై బెయిల్ కోసం షమీ దరఖాస్తు చేసుకోగా.. న్యాయమూర్తి పిటిషన్‌ను మన్నించి బెయిల్ మంజూరు చేశారు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!