Money Laundering Case: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చోకర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. దీన్ దయాళ్ ఆవాస్ యోజన పథకం కింద దాదాపు రూ.1,500 కోట్లను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, సికందర్ సింగ్, అతని తండ్రితో కలిసి, 1,500 మందికి పైగా గృహ కొనుగోలుదారులను మోసం చేసి, ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో కలిసి నకిలీ నిర్మాణ ఖర్చులను చూపించి రూ. 400 కోట్లు స్వాహా చేశారని ఈడీ గుర్తించింది. అయితే, గత ఏడాది మార్చిలోనే అతడ్ని అరెస్ట్ చేయగా.. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది.
Read Also: Tollywood : ట్రంప్ ట్యాక్స్.. ఓవర్సీస్ లో తెలుగు సినిమాకు గట్టి దెబ్బ
కాగా, మార్చి 2024లో, సికందర్‌ను ఈడీ అరెస్టు చేసింది. కానీ, పంజాబ్- హర్యానా హైకోర్టులో అతడు వేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరించిన తర్వాత.. జైలు శిక్షను తప్పించుకోవడానికి అనారోగ్యంతో ఉన్నట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో అతడికి చికిత్స పూర్తయ్యే వరకు అరెస్ట్ చేయొద్దని తెలిపింది. కాగా, రోహ్‌తక్‌లోని ఒక ఆసుపత్రి వెలుపల స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించాడు. ఈ విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతడ్ని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Rajinikanth : రజనీకాంత్ రిటైర్మెంట్ పై.. తలైవా భార్య ఇండ్రస్టింగ్ కామెంట్స్
అయితే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చోకర్ కు చెందినకంపెనీ మిహిరా గ్రూప్ ద్వారా పెద్ద ఎత్తున మోసానికి పాల్పడినట్లు గురుగ్రామ్ పోలీసులు ఆరోపిస్తూ FIR దాఖలు చేసిన తర్వాత 2023లో దర్యాప్తును తన ఆధీనంలోకి తీసుకుంది ఈడీ. గురుగ్రామ్‌లోని సెక్టార్ 68లో గృహా కొనుగోలుదారుల నుంచి సుమారు రూ. 363 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ విచారణలో గుర్తించింది.