Haryana:హర్యానాలోని సిర్సాకు చెందిన 500 మంది ఉమెన్స్ కాలేజ్ విద్యార్థినులు, చౌదరి దేవీలాల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీతో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్‌కి లేఖ రాశారు. ప్రొఫెసర్‌ని విధుల నుంచి తొలగించడమే కాకుండా.. అతడిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు.
Man kills Mother: డబ్బుల కోసం ఓ కన్న కొడుకు కర్కోటకుడిగా మారాడు. తల్లిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జరిగింది. రూ. 5000 ఇచ్చేందుకు నిరాకరించినందుకు 21 ఏళ్ల వ్యక్తి తల్లితో వాగ్వాదానికి దిగారు. చివరకు తల్లి గొంతు కోసి హత్య చేశాడు.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు, బీజేపీ ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఐఏఎస్ ఆఫీసర్ పరి బిష్ణోయ్‌ని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ నెల 22న వీరి వివాహం జరగనుంది. అయితే ఇందులో పెద్ద విశేషమేముంది అనుకోవచ్చు..కానీ ఈ పెళ్లికి అనేక ప్రత్యేకతలున్నాయి.
Haryana: తన మేనకోడలు పెళ్లిలో ఓ వ్యక్తి కనకవర్షం కురిపించాడు. వివాహ వేడుకులో కట్టలు కట్టలుగా డబ్బులు కుప్ప పోసి అతిథులందరిని ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అంత అతడి గురించే చెర్చించుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరూ.. అంత డబ్బు ఎక్కడితే అంటూ ఆరా తీస్తున్నారు. వివరాలు.. హర్యానాలోని రేవారీ నగరానికి చెందిన అసల్వాస్ సత్బీర్ సోదరి తన కూతురికి వివాహం జరిపించింది. ఆమెకు భర్త లేడు. దీంతో మేనమామగా మేనకోడలికి…
సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో దర్శనం ఇచ్చింది. ఓ వ్యక్తిపై దుండగులు తుపాకితో బుల్లెట్ల వర్షం కురిపిస్తుండగా ధైర్యంతో ఎదురుదాడి చేసిందో మహిళా. అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా అవుతోంది. ఈ సంఘటన హర్యానాలోని భివానీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. హర్యానాలో వానీలోని డాబర్ కాలనీలో ఓ వ్యక్తి ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. అదే సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై ఐదుగురు దుండగులు…
NIA: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలని భారత కాన్సులేట్ కార్యాలయంపై దాడి చేసిన ఘటనను ఎన్ఐఏ విచారిస్తోంది. ఈ మేరకు పంజాబ్, హర్యానాలోని 14 ప్రాంతాల్లో బుధవారం ఎన్ఐఏ సోదాలు చేసింది. పంజాబ్‌లోని మోగా, జలంధర్, లూథియానా, గురుదాస్‌పూర్, మొహాలీ, పాటియాలా, హర్యానాలోని కురుక్షేత్ర, యమునానగర్ జిల్లాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు.
Reservation: హర్యానాలో మనోహర్ లాల్ కట్టర్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తాకింది. బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన వివాదాస్పద బిల్లును పంజాబ్-హర్యానా హైకోర్టు కొట్టేసింది. ప్రైవేట్ రంగంలో రాష్ట్ర నివాసితులకు 75 శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేసే ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. హర్యానా స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ కాండిడేట్ యాక్ట్ 2020లో ఆమోదించిన తర్వాత అనేక మార్పులకు గురైంది. ఈ చట్టం ద్వారా నెలవారీ జీతం రూ.30,000 కన్నా తక్కువ ఉన్న ప్రైవేట్ ఉద్యోగాల్లో…
Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇది పూర్తిగా ప్రజల్ని చంపేస్తోందని, ఎంత మంది పిల్లలు నెబ్యులైబర్లపై ఉన్నారు.? అంటూ ప్రశ్నించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేవ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. దీనిపై శుక్రవారం తదుపరి విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Arvind Kejriwal: వచ్చే ఏడాది హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్ లో 117 స్థానాలకు గానూ 92 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చినట్లే హర్యానలో కూడా పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో పర్యటించారు. హర్యానాలోని రోహ్తక్లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.
Haryana: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడే తప్పుడు పనులకు పాల్పడ్డాడు. ఉన్న హోదాలో ఉన్న ప్రిన్సిపాల్ కీచకుడిగా మారాడు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హర్యానాలోని జింద్ జిల్లాలో చోటు చేసుకుంది. 50 మందికి పైగా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం ప్రకటించారు. నిందితుడైన వ్యక్తిని శనివారం అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. ఈ కేసును విచారించేందుకు డీఎస్పీ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు…