హర్యానాలోని పాల్వాల్‌లో దారుణం చోటు చేసుకుంది. తన తల్లి, సోదరిని వేధిస్తున్న ముగ్గురు దుర్మార్గులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన 10వ తరగతి విద్యార్థిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన గురువారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. పల్వాల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికొ తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థి లోకేష్‌గా గుర్తించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అయోధ్య రామమందిరంపై ఆ పార్టీ వైఖరిని ఉద్దేశిస్తూ ఈ రోజు విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాముడి ఉనికి ఊహాత్మకం అని, ఆలయాన్ని నిర్మించొద్దనే వారని, కాని ఇప్పుడు వారే ‘జై సియారం’ అని నినాదాలు చేస్తున్నారని అన్నారు. హర్యానాలోని రేవారిలో ఎయిమ్స్‌కి శంకుస్థాపనకు హాజరైన ప్రధాని మోడీ, అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశం ప్రపంచంలో మంచి గుర్తింపు పొందిందని, ఇది ప్రజల వల్లే…
Farmers' protest: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి హామీ ఇచ్చేలా చట్టం తీసుకురావడంతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కి పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సహా 200కు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఈ మార్చ్ చేయనున్నాయి.
Gurmeet Ram Rahim Singh: అత్యాచారం, హత్య దోషి డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(డేరాబాబా)కి మరోసారి పెరోల్ మంజూరైంది. తాజాగా 50 రోజలు పాటు పెరోల్ లభించింది. గత నాలుగేళ్లలో ఆయనకు పెరోల్ రావడం ఇది 9వ సారి. అని పెరోల్ పొడగింపుకు హర్యానా సర్కార్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆయన రోహ్తక్లోని సునారియ జైలులో ఉన్నాడు. రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్యల్లో…
Divya Pahuja: మాజీ మోడల్ దివ్య పహుజా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హర్యానాలోని ఓ హోటల్ గదిలో ఆమెను హత్య చేసి, డెడ్‌బాడీని ఈడ్చుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నిందితులు డెడ్‌బాడీని ఎక్కడ పారేశారనే విషయంపై పోలసీులు గత కొన్ని వారాలుగా వెతుకుతున్నారు. చివరకు ఓ కాలువలో కుళ్లిపోయిన స్థితితో దివ్యపహుజా మృతదేహం లభ్యమైంది. ఆమెను హత్య చేసిన తర్వాత పొరుగున ఉన్న పంజాబ్‌లోని కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
కాలేజీలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, సీఎంకి వందలాది మంది విద్యార్ధినులు లేఖ రాయడం తీవ్ర కలకలం రేపుతుంది. హరియాణాలోని సిర్సాకు చెందిన 500 మంది మహిళా కళాశాల విద్యార్థినులు చౌదరి దేవిలాల్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ లేఖ రాశారు.
Haryana:హర్యానాలోని సిర్సాకు చెందిన 500 మంది ఉమెన్స్ కాలేజ్ విద్యార్థినులు, చౌదరి దేవీలాల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీతో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్‌కి లేఖ రాశారు. ప్రొఫెసర్ని విధుల నుంచి తొలగించడమే కాకుండా.. అతడిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు.
Man kills Mother: డబ్బుల కోసం ఓ కన్న కొడుకు కర్కోటకుడిగా మారాడు. తల్లిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జరిగింది. రూ. 5000 ఇచ్చేందుకు నిరాకరించినందుకు 21 ఏళ్ల వ్యక్తి తల్లితో వాగ్వాదానికి దిగారు. చివరకు తల్లి గొంతు కోసి హత్య చేశాడు.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు, బీజేపీ ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఐఏఎస్ ఆఫీసర్ పరి బిష్ణోయ్‌ని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ నెల 22న వీరి వివాహం జరగనుంది. అయితే ఇందులో పెద్ద విశేషమేముంది అనుకోవచ్చు..కానీ ఈ పెళ్లికి అనేక ప్రత్యేకతలున్నాయి.
Haryana: తన మేనకోడలు పెళ్లిలో ఓ వ్యక్తి కనకవర్షం కురిపించాడు. వివాహ వేడుకులో కట్టలు కట్టలుగా డబ్బులు కుప్ప పోసి అతిథులందరిని ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అంత అతడి గురించే చెర్చించుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరూ.. అంత డబ్బు ఎక్కడితే అంటూ ఆరా తీస్తున్నారు. వివరాలు.. హర్యానాలోని రేవారీ నగరానికి చెందిన అసల్వాస్ సత్బీర్ సోదరి తన కూతురికి వివాహం జరిపించింది. ఆమెకు భర్త లేడు. దీంతో మేనమామగా మేనకోడలికి…