Haryana: హర్యానా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేశారు. ఛండీగఢ్‌లో గవర్నర్ బండారు దత్రాత్రేయ సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ కూడా ఉన్నారు. బీజేపీ-జేజేపీ మధ్య ఎంపీ సీట్ల షేరింగ్‌పై విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో ముఖ్యమంత్రిని మారుస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది.
హర్యానాలో లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ- జేజేపీ కూటమిలో విభేదాలు వచ్చిన.. నేపథ్యంలో సీఎం (Haryana CM) పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) ఇవాళ రాజీనామా చేశారు.
Brijendra Singh: లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీకి షాక్ తగిలింది. హర్యానాలో హిసార్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బ్రిజేంద్ర సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. తాను రాజీనమా చేసిన విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘‘ నేను బలవంతపు రాజకీయ కారణాల వల్ల బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. హిసార్ ఎంపీగా తనకు అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు శ్రీ.…
Farmers Protest : సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా అన్ని పంటలకు కనీస మద్దతు ధర (MSP) కోసం చట్టపరమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Viral Video: డ్రగ్స్‌పై ఓ పోలీస్ ఉన్నతాధికారిని స్టూడెంట్ ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. హర్యానాలోని సోనిపట్‌లో పోలీసులు నిర్వహించిన డ్రగ్ డి అడిక్షన్ ప్రచారంలో విద్యార్థి పోలీసుల్ని నిలదీశారు. డ్రగ్స్ అంత సులువుగా దొరికేలా చేస్తున్నారని ప్రశ్నించడం వీడియోలో చూడవచ్చు.
ఇటీవలే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పేపర్ లీకేజీలకు సంబంధించి కఠినమైన చట్టాన్ని అమలు చేసింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేశారు.
హర్యానాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హర్యానాలోని రేవారిలో బుధవారం హర్యానా రోడ్‌వేస్ బస్సు కారును ఎదురుగా ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
దేశ రాజధాని ఢిల్లీ ఆప్‌కు (AAP) బీజేపీకి (BJP) ఎంతో కీలకమైంది. ఇక్కడ మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నీ ప్రస్తుతం కమలం చేతిలోనే ఉన్నాయి.
Haryana: హర్యానా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) చీఫ్, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాథీని ఈ రోజు సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఆయన ప్రయాణిస్తున్న ఎస్యూవీ కార్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటన ఝజ్జర్ జిల్లాలో జరిగింది. అతనితో పాటు మరో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో వచ్చిన దుండగులు సమీపం నుంచి రాథీ, అతని అనుచరులపై కాల్పులకు తెగబడ్డారు. ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.