హర్యానాలోని ఓ కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ గిఫ్టులను అందించింది. దీపావళి కానుకగా కార్లను ఇచ్చింది. పంచకులలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని ఎంకే భాటియా తన ఉద్యోగులను సెలబ్రిటీలుగా పేర్కొంటూ.. 12 మంది స్టార్ పెర్ఫార్మర్స్‌కి కార్లను బహూకరించాడు.
Traders Protest on Basmati: దేశంలోని పలు రాష్ట్రాల్లో బియ్యం వ్యాపారులు నిరసనకు దిగారు. ఇది హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. నిరసన కారణంగా దాదాపు 300 హోల్‌సేల్ మార్కెట్లలో బాస్మతి కొనుగోలు నిలిచిపోయింది.
Breaking News: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ రోజు సాయంత్రం 4.08 గంటలకు హర్యానా ఫరీదాబాద్‌లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) వెల్లడించింది. ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి.
Haryana: ప్రస్తుత కాలంలో ప్రతీ చిన్న సమస్యకు ఆత్మహత్యనే పరిష్కారం అనుకుంటున్నారు. నేటి తరం చిన్న కష్టాన్ని కూడా తట్టుకోవడం లేదు. యువత కష్టాలతో ధైర్యంగా పోరాడలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే మైనర్లు కూడా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు.
హర్యానా ప్రభుత్వం హుక్కా ప్రియులకు చేదువార్త అందించింది. హర్యానాలోని హోటళ్లు, బార్‌లు, రెస్టారెంట్లలో ఇకపై హుక్కాను ప్రభుత్వం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు హుక్కా అందించడాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సోమవారం ప్రకటించారు.
హర్యానాలోని హిసార్ జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ను చిత్రహింసలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముందుగా కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ చేసి చితకబాదారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కరెంట్ షాక్ తో ఇబ్బందులకు గురిం చేశారు. అంతేకాకుండా కిడ్నాపర్లు గేదెల పేడను నోటిలో వేసి.. ముక్కుపై షూ రుద్దడంతోపాటు ఉమ్మి కూడా వేశారు. అయితే ఈ అరాచకాన్ని మొత్తం ఫోన్లలో వీడియో కూడా తీశారు కిడ్నాపర్లు.
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో కొత్త చట్టాలను అమలు చేస్తుంది.. ఎన్నో కఠిన శిక్షలను వేస్తుంది.. అయిన కూడా కామాంధులలో ఎటువంటి మార్పులు రాలేదు.. ఎప్పటికప్పుడు రెచ్చిపోతున్నారు.. దేశంలో ఎక్కడో చోట మహిళల పై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.. ఒక ఘటన మరువక ముందే మరో ఘటనతో మహిళలు భయ బ్రాంతులకు గురవుతున్నారు.. ఇక గ్యాంగ్ రేప్ లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. ముగ్గురు మహిళలపై కుటుంబ…
Nuh communal clashes: హర్యానా నూహ్ ప్రాంతంలో ఆగస్టు నెలలో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఊరేగింపుగా వెళ్తున్న హిందువులపై కొంతమంది ముస్లింలు కావాలని దాడులకు పాల్పడ్డారు. భవనాలపై రాళ్లు విసరడమే కాకుండా, ఆయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘర్షణల్లో మొత్తం ఆరుగురు మరణించారు.
Monu Manesar: వివాదాస్పద గోసంరక్షుడు మోనూ మనేసర్ ని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తలను హత్య చేశాడని, జూలై నెలలో హర్యానాలో నూహ్ ప్రాంతంలో మతకలహాలు పెరిగేందుకు కారకుడయ్యాడనే అభియోగాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో హర్యానాలో కారులో ఇద్దరు ముస్లింల శవాలు కాలిపోయన స్థితితో బయటపడ్డాయి. ఈ ఘటనలో మనేసర్ కీలక నిందితుడిగా ఉన్నాడు.