హర్యానాలో అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీలలో తమ అభ్యర్థుల కోసం అన్ని పార్టీల నేతలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగింది. కర్ర చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తి బైక్‌పై ఆయన కాన్వాయ్ పక్క నుంచే వెళ్లిపోవడం తీవ్ర కలకలం రేపుతుంది.
Firecracker Factory Blast: హర్యానాలోని సోనిపట్ జిల్లాలో అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని రిదౌ గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా నడుస్తున్న పటాకుల కర్మాగారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో ముగ్గురు సజీవదహనం కాగా, ఏడుగురు తీవ్రంగా కాలిపోయారు. ఘటనలోని క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా మారింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. Bomb Threat: బెంగళూరులోని ‘తాజ్ వెస్ట్ ఎండ్…
బీజేపీలో చేరాల్సిందిగా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆహ్వానంపై సిర్సా ఎంపీ కుమారి సెల్జా స్పందించారు. ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన శైలజ.. కాంగ్రెస్ రక్తం తన సిరల్లో ఉందని అన్నారు. తాను కాంగ్రెస్‌వాదిగానే ఉంటానని సూటిగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి వైరం లేదని అన్నారు. రానున్న కాలంలో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలిపారు.
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హర్యానాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో ఏ ప్రభుత్వం కొలువుదీరినా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుతోనే సాధ్యమవుతుందన్నారు. ఆప్ మంచి స్థాయిలో స్ధానాలను చేజిక్కించుకుంటుందని తెలిపారు. తమ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
Gang War: హర్యానాలోని రోహ్తక్లో ఒక్కసారిగా గ్యాంగ్ వార్ జరిగింది. రాహుల్ బాబా, ప్లాత్రా గ్యాంగ్ మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. అలాగే ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం ప్రకారం, రోహ్తక్ లోని సోనిపట్ రోడ్ లోని బలియానా మోర్ సమీపంలోని మద్యం దుకాణం వద్ద కూర్చున్న…
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 5న ఓటింగ్ జరగనుంది. బీజేపీ ప్రచారానికి పదును పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు కురుక్షేత్ర థీమ్ పార్క్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కురుక్షేత్రలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అండర్‌పాస్‌లో నీరు నిలిచి ఉండటంతో.. అది గమనించని ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. ఓల్డ్ ఫరీదాబాద్ రైల్వే అండర్‌పాస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నీరు నిలిచిపోవడంతో వారి ఎస్యూవీ అందులో ఇరుక్కుపోయింది. దీంతో వారు బయటకు రాలేక కారులోనే ఉండటంతో ఊపిరాడక మరణించారని పోలీసులు శనివారం తెలిపారు.