Firecracker Factory Blast: హర్యానాలోని సోనిపట్ జిల్లాలో అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని రిదౌ గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా నడుస్తున్న పటాకుల కర్మాగారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో ముగ్గురు సజీవదహనం కాగా, ఏడుగురు తీవ్రంగా కాలిపోయారు. ఘటనలోని క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా మారింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Bomb Threat: బెంగళూరులోని ‘తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్’కు బాంబు బెదిరింపు!
సమాచారం ప్రకారం, రిదౌ గ్రామానికి చెందిన వేద్ అనే వ్యక్తి తన ఇంట్లో అక్రమంగా పటాకుల ఫ్యాక్టరీని నడుపుతున్నాడు. అందులో 10 నుండి 12 మంది పని చేసేవారు. శనివారం నాడు కార్మికులు పటాకుల తయారీ పని చేస్తుండగా, ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీలో భారీ మంటలు చెలరేగాయని, కొద్దిసేపటికే ఇల్లు మొత్తం దగ్ధమైందని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు సజీవదహనమయ్యారు. బాణసంచా ఫ్యాక్టరీలో మండే పదార్థం ఉండడంతో మంటలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను ఆర్పివేయడంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు.
Harsha Sai: హర్షసాయి కోసం రంగంలోకి 4 ఎస్‌వోటీ పోలీసు టీమ్స్
మంటల్లో కాలిపోవడంతో తీవ్రంగా గాయపడిన 7 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు వారి పరిస్థితి విషమంగా ప్రకటించారు. దాంతో అంబులెన్స్‌లో ప్రతి ఒక్కరినీ పిజిఐ రోహ్‌తక్‌కు రెఫర్ చేశారు. తన ఇంట్లో అక్రమంగా పటాకుల ఫ్యాక్టరీ నడుపుతున్న వేద్ పరారీలో ఉన్నట్లు సమాచారం. సోనిపట్ పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో పటాకుల ఫ్యాక్టరీ నడుస్తోందన్న విషయం చుట్టుపక్కల వారికి కూడా తెలియదు. విచారణ తర్వాత పరిస్థితి తేలనుందని పోలీసులు చెబుతున్నారు.
3 लोगों की जलकर मौत, भीषण आग की चपेट में अवैध पटाखा फैक्टरी #Sonipat pic.twitter.com/QGOETAi3v6
— Janta Se Rishta News | जनता से रिश्ता न्यूज़ (@jantaserishta) September 28, 2024