హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ అభ్యర్థి యూటర్న్ తీసుకున్నాడు. తొలి జాబితాలో పెహావా నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా కన్వల్జీత్సింగ్ అజ్రానా పేరును కమలం పార్టీ ప్రకటించింది.
ప్రధాని మోడీ ముందు తన భర్త కేజ్రీవాల్ ఎప్పటికీ తలవంచరని సునీతా కేజ్రీవాల్ అన్నారు. హర్యానాలో సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు శనివారం ఆప్ ప్రకటించింది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో శనివారం సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇండియా కూటమిలోని భాగమైన ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిగాయి. కానీ చర్చలు సఫలీకృతం కాలేదు. ఆప్ ఆశించిన విధంగా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. సింగిల్ డిజిట్‌కే హస్తం పార్టీ పరిమతం చేసింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి రుచించలేదు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆ పార్టీ ప్రకటించింది.
Brij Bhushan: రెజ్లర్ వినేష్ ఫొగట్ పై మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వినేష్ ఫొగట్ ఒలంపిక్స్‌లో మోసం చేసి ఫైనల్ వరకు వెళ్లిందని ఆయన ఆరోపించారు. అందుకే ఆమెకు పథకం రాకుండా దేవుడు శిక్షించాడని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు అన్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరనట్లుగా తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినా సఫలీకృతం కాలేదు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హర్యానా బీజేపీలో అభ్యర్థుల ప్రకటన తర్వాత తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేకెత్తించింది. పలువురు సీనియర్ నాయకులకు, మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు అధిష్టానం టికెట్లు నిరాకరించింది. దీంతో నేతలు తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్నారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో సమావేశం అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.
Sweeper Posts: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాలలో సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. పోస్ట్ ఏదైనా సరే అర్హత అంతకుమించి ఉన్న కానీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే తాజాగా హర్యానా రాష్ట్రంలో ఈ నిరుద్యోగ సమస్య ఎలా ఉందో చెప్పేందుకు ఓ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఇందుకు సంబంధించిన…
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేసింది. 67 మందితో కూడిన తొలి జాబితాను బుధవారం సాయంత్రం బీజేపీ ప్రకటించిండి. ముఖ్యమంత్రి నయాబ్ సైనీ లాడ్వా నుంచి పోటీ చేయనున్నారు.
త్వరలోనే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించేస్తున్నారు. అయితే ఇండియా కూటమిలో మాత్రం సందిగ్ధత నెలకొంది.
హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాలో సంచలన ఘటన వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీని కొట్టి చంపినందుకు గాను గోసంరక్షక బృందానికి చెందిన ఐదుగురిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఫ్ మాంసం తిన్నాడనే అనుమానంతో నిందితులు సబీర్ మాలిక్‌ను ఆగస్టు 27న హత్య చేశారు.