హర్యానా రాష్ట్రం గురుగావ్‌లో మాజీ జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ ను తండ్రి హత్య చేసిన సంగతి తెలిసిందే. రాధిక తండ్రి దీపక్ ఆమెపై వెనుక నుంచి మూడు బుల్లెట్లను పేల్చారని, దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆవేశంలో కుమార్తెను తండ్రి చంపేశాడని.. ఇప్పుడు పశ్చత్తాపంతో కుమిలిపోతున్నారని కుటుంబీకులు వెల్లడించారు.
గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన హర్యానాలోని సిర్సాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా కేరళ ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రచారంలో అతిథిగా పాల్గొన్నట్లు తెలిసింది. ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పీఏ. మహమ్మద్ రియాస్ నేతృత్వంలోని టూరిజం డిపార్ట్‌మెంట్ అమెకు స్పాన్సర్ చేసిందని వార్తలు చెక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ అంశంపై మంత్రి మహమ్మద్ రియాస్ స్పందించారు.
హర్యానాలోని పంచకులాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ మిట్టల్ అనే వ్యాపారవేత్త తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య, తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు సహా ఏడుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. దాదాపు 20 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నట్లు సంచలన విషయాలు రాసుకొచ్చారు.
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అందరినీ ఆశ్చర్య పరిచింది. పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టు అనంతరం అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి పాకిస్థాన్, చైనాతో సహా అనేక దేశాలకు ప్రయాణించిందని చెబుతున్నారు. కేవలం రూ.20,000 ఉద్యోగంతో ప్రారంభించిన జ్యోతి, ఇప్పుడు ప్రసిద్ధ యూట్యూబర్‌గా మారింది.
ATM Hack: హర్యానాలోని గురుగ్రామ్‌లో షాకింగ్ దొంగతన ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ-జైపూర్ హైవేపై ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో దొంగలు ఏటీఎం మెషిన్‌ను ధ్వంసం చేయకుండా, ఎటువంటి కార్డ్ ఉపయోగించకుండా సుమారు 10 లక్షల రూపాయలకుపైగా నగదు దోచుకెళ్లారు. ఈ సంఘటన ఏప్రిల్ 30న జరిగినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులుకి వచ్చింది. అసలు ఈ ఘటన ఎలా జరిగిందంటే.. Read Also: Triumph Scrambler 400 X: అదిరిపోయే లుక్…
Haryana Elections : హర్యానా అసెంబ్లీ ఎన్నికల తీర్మాన లేఖను బీజేపీ విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో ఈ తీర్మాన లేఖను విడుదల చేశారు.
Haryana : హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సజీవ దహనం కాగా, రెండు డజన్ల మందికి పైగా తీవ్రంగా కాలిపోయారు. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు.
Haryana : హర్యానాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో నైబ్ సింగ్ సైనీ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు.
Cyber Crime: జార్ఖండ్‌లో సైబర్ మోసాలకు జమ్తారా చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు హర్యానాకు చెందిన నుహ్ కొత్త జమ్తారాగా మారింది. ఇక్కడ సైబర్ మోసాల కేసులు భారీగా పెరిగాయి.