ATM Hack: హర్యానాలోని గురుగ్రామ్‌లో షాకింగ్ దొంగతన ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ-జైపూర్ హైవేపై ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో దొంగలు ఏటీఎం మెషిన్‌ను ధ్వంసం చేయకుండా, ఎటువంటి కార్డ్ ఉపయోగించకుండా సుమారు 10 లక్షల రూపాయలకుపైగా నగదు దోచుకెళ్లారు. ఈ సంఘటన ఏప్రిల్ 30న జరిగినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులుకి వచ్చింది. అసలు ఈ ఘటన ఎలా జరిగిందంటే..
Read Also: Triumph Scrambler 400 X: అదిరిపోయే లుక్ లో ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ లాంచ్..!
దొంగలు ఎటీఎం బూత్‌కు వెళ్లి మొదటగా వీడియో రికార్డింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఆ తర్వాత సెక్యూరిటీ సిస్టమ్‌ను హ్యాక్ చేసి నగదు అపహరించారు. ఈ చోరీ విషయంలో గౌరవ్ కుమార్ బైస్లా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అతను హిటాచీ పేమెంట్ సర్వీసెస్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ సంస్థ బ్యాంకుల ఎటీఎంల నిర్వహణ బాధ్యతను తీసుకుంటుంది. ఇక చోరీ జరిగిన యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం రికో ఆటో ఇండస్ట్రీస్ సమీపంలో ఉంది. దొంగలు అక్కడి నుంచి కేవలం నగదు మాత్రమే కాకుండా డిజిటల్ వీడియో రికార్డర్ (DVR), బ్యాటరీలు, హార్డ్ డిస్క్, పీసీ కోర్, ఛెస్ట్ లాక్ తదితర పరికరాలను కూడా దోచుకెళ్లారు.
Read Also: Stock Market Rally: సెన్సెక్స్ 2,000 పాయింట్లు పైగా జంప్.. మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలు ఇవే!
ఈ ఘటనపై సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, ప్రస్తతం దర్యాప్తు జరుగుతోంది. దొంగలు ఎటీఎం సాఫ్ట్‌వేర్ ను ఎలా హ్యాక్ చేసారు? వారు ఎంత సేపులో ఈ దొంగతనం నిర్వహించారు? వంటి కోణాల్లో టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ సహాయంతో విచారణ కొనసాగుతోంది. దాంతో పాటు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనతో ఎటీఎం భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలు బహిర్గతం కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.