గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన హర్యానాలోని సిర్సాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా కేరళ ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రచారంలో అతిథిగా పాల్గొన్నట్లు తెలిసింది. ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పీఏ. మహమ్మద్ రియాస్ నేతృత్వంలోని టూరిజం డిపార్ట్‌మెంట్ అమెకు స్పాన్సర్ చేసిందని వార్తలు చెక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ అంశంపై మంత్రి మహమ్మద్ రియాస్ స్పందించారు. గతంలో రాష్ట్రంలోని పర్యాటకాన్ని ప్రచారం చేసేందుకు నియమించిన ఓ ఏజెన్సీ టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి దేశంలోని పలువురు యూట్యూబర్‌లను రాష్ట్రానికి ఆహ్వానించిందని తెలిపారు. “రాష్ట్రంలోని పర్యాటకాన్ని ప్రచారం చేసేందుకు నియమించిన ఓ ఏజెన్సీ టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి పలువురు యూట్యూబర్‌లను రాష్ట్రానికి ఆహ్వానించింది. ఇందులో జ్యోతి ఒకరు. ఆమెపై గూఢచర్య ఆరోపణలు రావడానికి చాలా కాలం ముందు ఇది జరిగింది. జ్యోతి మల్హోత్రా ఎంపిక వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రేమీ లేదు.” అని మంత్రి స్పష్టం చేశారు.
READ MORE: Minister Payyavula: ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు..
కాగా.. కాంగ్రెస్, బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని విమర్శించాయి. ప్రచారానికి ఆహ్వానించే ముందు వారి నేపథ్యాలను ఎందుకు సరిగ్గా తనిఖీ చేయలేదని ప్రశ్నించాయి. “పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా వామపక్ష ప్రభుత్వ ఆహ్వానం మేరకు కేరళను సందర్శించారు. పర్యాటక శాఖ మర్యాదతో ఆమె రాష్ట్ర అతిథిగా ఆహ్వానించింది. ఈ విషయాన్ని ఆర్టీఐ (RTI) వెల్లడించింది. కాబట్టి వామపక్షాలు పాక్ గూఢచారులకు రెడ్ కార్పెట్ వేశాయి? పర్యాటక మంత్రి మొహమ్మద్ రియాస్ విజయన్ అల్లుడు. ఆయనను పదవి నుంచి తొలగించి.. దర్యాప్తు చేయాలి” అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవల్లా ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
READ MORE: AP Cabinet: రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!