హైదరాబాద్ నగరం గురించి సూపర్ స్టార్ రజనీకాంగ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. హైదరాబాద్ లో ఉన్నాన్నా.. న్యూయార్క్ లో ఉన్నాన్నా.. అని ఇక్కడి అభివృద్ది గురించి ఆయన మాట్లాడారని హరీశ్ రావు అన్నారు.
సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అకాల వర్షాలతో నోటికి వచ్చిన బుక్క జారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Off The Record: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆ సందర్భంగా మంత్రి హరీష్రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అందరి దృష్టి ఒక్కసారిగా గజ్వేల్ వైపు మళ్ళింది. కేసీఆర్ను తమ దగ్గర్నుంచి పోటీ చేయమంటే.. తమ దగ్గర్నుంచి చేయమని అనేక జిల్లాల వాళ్ళు అడుగుతున్నారని అన్నారు హరీష్రావు. అంటే.. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడం…
ఖమ్మం జిల్లా కల్లూరులో బీఅర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వైద్య,ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. బీజేపీ వాళ్లు తెలంగాణలో గెలుస్తాం అని మాట్లాడుతున్నారని.. కానీ ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కాదు కదా.. డిపాజిట్ కూడా రాదన్నారు. జిల్లాలో డిపాజిట్ రాని పార్టీ రాష్ట్రం లో అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు.
ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో మరో అడుగు పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. దీంతో మరో వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని బీఆర్ఎస్ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు ఢిల్లీలో ఉన్నోళ్లకు గులాంగిరి చేస్తారని, బీజేపీ వాళ్లు గుజరాత్ పెద్దలకు గులాంగిరి చేస్తారని.. కానీ బీఆర్ఎస్ వాళ్లు తెలంగాణ ప్రజలకు గులాం గిరి చేస్తారని మంత్రి అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చౌటుప్పల్ ఆస్పత్రితో పాటు నియోజకవర్గంలోని 4 పీహెచ్సీలను అప్గ్రేడ్ చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
Ramakrishna: తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు ఎందుకు ఆచరించలేదు? అని ప్రశ్నించారు.. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామన్న విషయం ఏమైంది? అని నిదీశారు.. విభజన చట్ట హామీల అమలు, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ…