Irrigation Day: తెలంగాణలో సాగునీటి దినోత్సవ వేడుకలు.. జిల్లాల వారిగా ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irrigation Day: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు మొదలయ్యాయి. రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు నీటిపారుదల దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, కేటాయింపులకు నీరు, ఇతర నిర్మాణాలు, సాగునీటి రంగంలో తీసుకొచ్చిన మార్పులపై నియోజకవర్గాల వారీగా నీటిపారుదల శాఖ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. సాగునీటి పండుగ నేపథ్యంలో కాళేశ్వరంతోపాటు అన్ని జిల్లాల్లోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల డ్యామ్‌లు, లిఫ్ట్ స్కీమ్‌లు, పంప్‌హౌజ్‌లను రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఊరూర చెరువుల పండుగను గురువారం నిర్వహించనున్నారు. చెరువుల పునరుద్ధరణ పథకం మిషన్ కాకతీయ కింద మరమ్మతులు చేసిన చెరువుల కట్టలపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జిల్లాల వారిగా..
Also Read
- Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
- Telangana Inter Exams : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి థియరీ పరీక్షలు
- Uttam Kumar Reddy : జలవాటాలో ఒక్క చుక్కా వదులుకోం.. ఏపీ యత్నాలను అడ్డుకుంటాం
- CM Revanth Reddy: క్యూర్, ప్యూర్, రేర్.. తెలంగాణ సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మూడు రీజియన్ల ఫార్ములా..
* రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి దినోత్సవం వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. రామప్ప రిజర్వాయర్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి గోదావరికి హారతి ఇవ్వనున్నారు. నేడు ములుగులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. ఉదయం 10:15 గంటలకు హెలికాప్టర్ ద్వారా ములుగు చేరుకుంటారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం, మోడల్ బస్టాండ్, సేవాలాల్ భవన్, డిజిటల్ లైబ్రరీ, ఐ అండ్ పీఆర్ మీటింగ్ హాల్, సీసీ రోడ్డు తదితర పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
* నేడు నిజమాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా న్యూ అంబేద్కర్ భవన్ లో సాగు నీటి దినోత్సవం లో పాల్గొననున్నారు. నిజమాబాద్ అర్బన్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్. ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొననున్నారు.
* నేడు నిజమాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించనున్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎస్.ఆర్.ఎస్.పి. రివర్స్ పంపింగ్ జీరో పాయింట్ వద్ద సాగునీటి దినోత్సవంలో మంత్రి పాల్గొననున్నారు.
* నేడు కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ లో స్పీకర్ పోచారం పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దాపూర్ రిజర్వాయర్ వద్ద జరిగే సాగునీటి దినోత్సవంలో స్పీకర్ పాల్గొననున్నారు.
* నేడు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మంత్రి హరీష్ పర్యటించనున్నారు. సంగారెడ్డి జిల్లా చిన్న చల్మెడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి మంత్రి భూమి పూజ చేయనున్నారు. సిద్దిపేట జిల్లా చందూలపూర్ లో చందూలాపూర్ ఎత్తిపోతల పథకానికిమంత్రి హరీష్ రావు భూమి పూజ చేయనున్నారు.
* సూర్యాపేట జిల్లాలో సాగునీటి సంబరాలలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో కాలేశ్వర జలాలకు లక్ష జనహారతి నిర్వహించనున్నారు. చివ్వెంల నుండి పెన్ పహాడ్ వరకు కాలేశ్వరం కాలువల వద్ద జనాలకు ప్రత్యేక పూజలు జరగనున్నారు. 7 మండలాలలో 126 గ్రామాల ప్రజలతో 280 మంది అధికారుల పర్యవేక్షణలో కాలేశ్వరం జలాలకు లక్ష జన హారతి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
* నేడు భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో అన్నారం సరస్వతీ బ్యారేజ్ వద్ద దశాబ్ధి వేడుకలు జరగనున్నాయి. సాగునీటి దినోత్సవం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభంకానుంది. ముఖ్య అతిథులుగా మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరుకానున్నారు. 3 వేల మంది రైతులతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. గాయని మంగ్లీతో స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించారు. నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమలు, లేజర్ లైట్ షో, మంత్రుల సందేశాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తిచేసింది.
Petrol-Diesel rates: భారత్ లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు.. లీటరు ఎంతో తెలుసా..?
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Bhogi Release: శర్వానంద్ ‘భోగి’ ఊచకోత అప్పుడే..
-
Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు కష్టకాలం.. సిందూర్‌పై కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Vipperla TDP Clash : పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్‌తో మహిళ హల్చల్.. విప్పర్లలో టీడీపీ వర్గపోరు!
-
Arjun Sarja: నా కూతురి జోలికొస్తే ఊరుకోను.. యాక్షన్ కింగ్ అర్జున్ ఫైర్!
-
CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!