తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు అని, కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. రేవంత్ జేబులో కత్తెర పెట్టుకొని మాజీ సీఎం కేసీఆర్ చేసిన పనులకు రిబ్బన్ కట్ చేస్తున్నాడని విమర్శించారు. రిబ్బన్ కత్తిరించడం లేదంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు కట్ చేయడమే రేవంత్ పని అని పేర్కొన్నారు. కాళేశ్వరం కూలిందని చెబుతున్న సీఎం రేవంత్.. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ నగరంకి…
మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ హరీష్ రావు.. మీలాగా మాటలు కాదు, చేతల ప్రభుత్వం మాది అని విమర్శించారు. విద్యా, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాం అని, శంకుస్థాపన స్థాయిలో వదిలి వెళ్లిపోయిన హాస్పిటల్స్ ఈ 21 నెలల్లో వేగంగా నిర్మిస్తున్నాం అని అన్నారు. మీ ప్రభుత్వం 40 వేల కోట్ల బకాయి పెట్టిపోతే.. తాము చెల్లిస్తున్నాంఅని మండిపడ్డారు. నిత్యం మా ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష…
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు.
దీపికా పదుకొణే పొగరు వల్ల ఓ ఇద్దరి బాలీవుడ్ బ్యూటీస్ కి కలిసొచ్చింది యానిమల్తో రష్మిక నుండి నేషనల్ క్రష్ ట్యాగ్ తీసుకున్న త్రిప్తి దిమ్రీకి అక్కడి నుండి లక్ దడేల్ దడేల్ అని తన్నుకొస్తుంది. హిందీలో స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకోవడమే కాదు టాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైంది. దీపికా పదుకొణే అత్యుత్సాహం, యారోగన్సీ వల్ల త్రిప్తి లాభం పొందింది. ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా హై అక్డేన్ మూవీలో తానూ ఊహించకుండానే ఛాన్స్…
Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజకీయం మొదలైంది. మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం, కేంద్రంపై విరుచుకుపడ్డారు. హరీష్ రావు మాట్లాడుతూ.. “ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా, తిరిగి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రజలు మళ్లీ కేటీఆర్, కేఎస్ఆర్ నేతృత్వంలోనే తెలంగాణను ముందుకు నడిపిస్తారు” అని ధీమా వ్యక్తం చేశారు. “బీజేపీ దేశం కోసం కాదు, కేవలం నార్త్ ఇండియన్ ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోంది. తెలంగాణ కూడా భారతదేశంలో భాగమే కదా?…
Harish Rao: కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డిపేటలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేడు (అక్టోబర్ 5) పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను వారు పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే స్థానిక ఇన్చార్జ్ మంత్రుల…
ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యం చేయలేదు.. అర్హులైన వారికి ఏడాదికి రూ. 15 వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం అమలు సమయంలో ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేశాం.. ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే ఆటో డ్రైవర్ల ఉపాధికి ఇబ్బంది అవుతుందని చర్చించాం.. కేబినెట్ మీటింగ్ లో సీఎం ఆటో డ్రైవర్స్ గురించి హామీ…
నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటనను మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. యూరియా కోసం ధర్నా చేసిన ఒక గిరిజన యువకుడిపై పోలీసులు కులం పేరుతో దూషిస్తూ, పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి, కాళ్లు కట్టి లాఠీలతో బాదడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.