Director Krish: గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులందరూ రాడిసన్ హోటల్‌లో ఘనంగా పార్టీ చేసుకున్నారని వీరిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడు, వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారని తేల్చారు. పక్కా సమాచారంతో పోలీసులు రాడిసన్ హోటల్‌పై దాడి చేయగా అక్కడ యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.