ఈమధ్య యువ దర్శకులందరూ విభిన్నమైన కథాచిత్రాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తున్నారు. మునుపెన్నడూ ట్రై చేయని సబ్జెక్టుల్ని, కామిక్ యాంగిల్‌లో చూపిస్తూ, ఆడియన్స్‌ను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో దర్శకుడు రితేష్ రానా ఆల్రెడీ విజయవంతం అయ్యాడు. తన తొలి చిత్రం(మత్తు వదలరా)తో ప్రేక్షకుల మత్తు వదిలించాడు. ఇప్పుడు హ్యాపీ బర్త్‌డే అంటూ మరో కొత్త కాన్సెప్ట్‌తో మన ముందుకు రాబోతున్నాడు.
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సత్య, ప్రియదర్శి సహా ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా టీజర్‌ని వదిలారు. ఇందులో మినిస్టర్‌గా కనిపించిన వెన్నెల కిశోర్, గన్ బిల్లుని పాస్ చేయించగా.. ఆయుధాల అమ్మకం లీగల్ అవుతుంది. అప్పట్నుంచి ప్రతీ గల్లీలోనూ తుపాకులు, బాంబుల హోరే! బార్ డ్యాన్సర్‌గా తళుక్కుమన్న లావణ్య సైతం మెషీన్ గన్‌తో తూటాల వర్షం కురిపిస్తూ ఈ టీజర్‌లో కనిపించింది. ఓవరాల్‌గా ఈ టీజర్ చాలా క్రేజీగానూ, అదే సమయంలో ఇంట్రెస్టింగ్‌గానూ ఉంది.
‘మత్తు వదలరా’ తరహాలోనే ఇందులోనూ హ్యూమర్ సాలిడ్‌గా ఉండేలా కనిపిస్తోంది. ఈసారి గన్స్‌తో ఏదో విభిన్నమైన ఎక్స్‌పీరియన్స్‌ని దర్శకుడు రితేష్ ఇవ్వబోతున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఈ టీజర్‌కి కాల భైరవ ట్రెండీ మ్యూజిక్ అందించి, మరోసారి తన ముద్ర వేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ టీజర్‌లో పాన్ తెలుగు సినిమా అంటూ వివిధ భాషల్లో చూపించడం ప్రత్యేకతగా నిలిచింది.