కాల్పుల విరమణపై హమాస్‌తో అమెరికా మరోసారి చర్చలు జరిపింది. బందీల విడుదల, గాజాలో కాల్పుల విరమణపై హమాస్‌తో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ చర్చలు జరిపారు. కానీ అమెరికా ప్రతిపాదనలను హమాస్ తిరస్కరించింది. అమెరికా ప్రతిపాదనలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని హమాస్ పేర్కొంది.
హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే హమాస్ అగ్ర నాయకులందరినీ హతమార్చింది. తాజాగా ప్రస్తుత హమాస్ గాజా చీఫ్ ముహమ్మద్ సిన్వర్‌ను కూడా చంపేసినట్లుగా బుధవారం అధికారికంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పార్లమెంట్ వేదికగా ప్రకటించారు
గాజాను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఇజ్రాయెల్ యోచిస్తున్నట్లుగా బ్లూమ్‌బెర్గ్ ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. 75 శాతం గాజాను నియంత్రించాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వార్ చనిపోయే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. గత 5 నెలల్లో తొలిసారి బుధవారం నెతన్యాహు మీడియాతో మాట్లాడారు.
గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం కొనసాగిస్తోంది. తాజాగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఐడీఎఫ్ దళాలు జరిపిన దాడుల్లో 60 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇజ్రాయెల్-గాజా మధ్య కొన్ని నెలలుగా యుద్ధం సాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఐడీఎఫ్ యుద్ధం చేస్తోంది. ఇప్పటికే గాజాను ఇజ్రాయెల్ సర్వనాశనం చేసింది. అయితే మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా బందీలు-ఖైదీల మార్పిడి జరిగింది.
Israel-Hamas: ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేయడంతో గాజా ప్రాంతంలో గురువారం ఒక్క రోజులోనే 80 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారని పాలస్తీనా వైద్య వర్గాలు వెల్లడించాయి. ఖాన్ యూనిస్‌లోని నాసర్ ఆసుపత్రి ప్రకారం, ఆ నగరంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 54 మంది మరణించారు. దాడుల్లో తీవ్రంగా గాయపడిన వారు అనేకమంది ఉన్నారు. అలాగే గాజా నగరం, ఉత్తర గాజా ప్రాంతాల్లో జరిగిన ఇతర వైమానిక…
పహల్గామ్ ఉగ్ర దాడిని అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మారణహోమంతో అమెరికా పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ పోల్చారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుందని.. అలాగే పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సూచించారు.
గాజా-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత ఒప్పందం ముగిశాక పరిస్థితులు మళ్లీ చేజారాయి. హమాస్ అంతమే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మరింత తీవ్రమైంది. గత 48 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 90 మందికి పైగా మృతిచెందారు. ఈ మేరకు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.