Israel: హమాస్ కొత్త చీఫ్ ముహమ్మద్ సిన్వర్ హతం.. నెతన్యాహు ప్రకటన
- హమాస్ కొత్త చీఫ్ ముహమ్మద్ సిన్వర్ హతం
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే హమాస్ అగ్ర నాయకులందరినీ హతమార్చింది. తాజాగా ప్రస్తుత హమాస్ గాజా చీఫ్ ముహమ్మద్ సిన్వర్‌ను కూడా చంపేసినట్లుగా బుధవారం అధికారికంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ముహమ్మద్ సిన్వర్ మరణాన్ని అధికారికంగా ధృవీకరించారు. 2024, అక్టోబర్‌లో హతమైన హమాస్ మాజీ చీఫ్ యాహ్యా సిన్వర్ సోదరుడే ముహమ్మద్ సిన్వర్. యాహ్యా సిన్వర్ హతమయ్యాక ముహమ్మద్ సిన్వర్ హమాస్ గాజా చీఫ్‌గా ఎన్నికయ్యాడు. ఇతడు 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడికి కుట్రదారుడిగా ఇజ్రాయెల్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Harvard: కుమారుడికి సీటు ఇవ్వలేదనే హార్వర్డ్‌పై ట్రంప్ చర్యలు.. సోషల్ మీడియాలో చర్చ
Also Read
మే 14న ఐడీఎఫ్ దళాలు జరిపిన భారీ వైమానిక దాడిలో ముహమ్మద్ సిన్వర్ చనిపోయినట్లు నివేదికలు అందాయి. కానీ పూర్తి క్లారిటీగా మరణాన్ని ధృవీకరించలేకపోయారు. ఆ సమయంలో తీవ్రంగా గాయపడినట్లుగా ఐడీఎఫ్ భావించింది. తాజాగా మరణాన్ని అధికారికంగా నిర్ధారించింది. మే 14న ఇజ్రాయెల్ దళాలు డ్రోన్ దాడి చేసినప్పుడు ఉగ్రవాద సంస్థ కమాండ్ సెంటర్‌గా ఉపయోగిస్తున్న భూగర్భ కేంద్రంలో ఉన్నాడు. ఖాన్ యూనిస్‌లోని యూరోపియన్ హాస్పిటల్ కింద ఈ కమాండ్ సెంటర్ ఉంది. ఇజ్రాయెల్ సైన్యం ఖచ్చితమైన దాడి తర్వాత జరిగిన పరిణామాల వీడియోను విడుదల చేసింది. దీనిలో ఆసుపత్రి కింద ఒక సొరంగం మార్గం ఉంది. ఆ సమయంలో ముహమ్మద్ సిన్వర్ ఇక్కడ్నే ఉన్నాడు. పక్కా ప్లాన్‌తో దాడి చేయడంతో చనిపోయాడు. కానీ అప్పుడు క్లారిటీ రాలేదు.
ఇది కూడా చదవండి: Minister Nimmala: ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా చేసింది.. చేయబోయేది తెలుగుదేశమే
తాజాగా ముహమ్మద్ సిన్వార్‌ను తొలగించినట్లు ప్రధాన మంత్రి నెతన్యాహు ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన నెస్సెట్ వేదికపై నుంచి ప్రకటించారు. మేము ఇస్మాయిల్ హనియే, మొహమ్మద్ దీఫ్, యాహ్యా సిన్వార్, ఇప్పుడు ముహమ్మద్ సిన్వార్‌లను తొలగించినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!