Israel-Hamas War: ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హమాస్ దాడులకు తగిన సమాధానం ఇచ్చింది. గాజా స్ట్రిప్‌పై నిరంతరం బాంబు దాడులు జరుగుతున్నాయి.
Israel-Hamas War: ఇజ్రాయిల్ పై దాడి చేసి చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని హతమార్చింది హమాస్ ఉగ్రవాద సంస్థ. హమాస్ జరిపిన దాడిలో ఇప్పటి వరకు 1200 మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. ఇదిలా ఉంటే హమాస్ జరిపిన అనాగరిక హత్యల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు. బుధవారం ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. హమాస్, ఐసిస్ కన్నా హీనంగా ఉందని విమర్శించారు. ఒక జాతిని నిర్మూలించాలనుకున్న ఉగ్రవాదులే ఇలాంటి…
Himanta Biswa Sarma: పాలస్తీనాకు మద్దతు ఇస్తూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానం చేసింది. అయితే ఈ తీర్మానంపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రకటన పాకిస్తాన్, తాలిబాన్ ప్రకటనల్ని పోలి ఉందని ఆరోపించారు.
Aligarh Muslim University: ఇజ్రాయిల్- పాలస్తీనా హమాస్ యుద్ధంలో ఇండియాలోని ప్రజలు కూడా ఇరుపక్షాలకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో పాలస్తీనాకు మద్దతుగా కొందరు విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం వివాదాస్పదమైంది. పాలస్తీనాకు సంఘీభావం తెలిపేందుకు పలువరు విద్యార్థులు సోమవారం మార్చ్ నిర్వహించినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Israel War: ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు భీకరదాడికి పాల్పడ్డారు. బలమైన సైన్యం, టెక్నాలజీ, మెస్సాద్ వంటి ఇంటెలిజెన్స్ సంస్థ ఉన్నప్పటికీ.. ఇలాంటి దాడిని ఊహించలేకపోయింది. అంత పకడ్భందీగా హమాస్ గాజా నుంచి కేవలం నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించింది.
Putin: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇజ్రాయిల్ పై హమాస్ మిలిటెంట్లు శనివారం భారీ దాడికి తెగబడ్డారు. కేవలం 20 నిమిషాల్లోనే 5000 వేల రాకెట్లను ప్రయోగించారు. ఈ పరిణామంతో ఇజ్రాయిల్ షాకైంది. అయితే తేరుకునేలోపే వందల మందిని సరిహద్దు దాటి వచ్చిన మిలిటెంట్లు పిట్టల్లా కాల్చి చంపారు. 1000 మంది వరకు ఇజ్రాయిల్ ప్రజలు మరణించారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకర దాడులు నిర్వహిస్తోంది.
Israel: గాజాపై విరుచుకుపడేందుకు ఇజ్రాయిల్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. శనివారం హమాస్ టెర్రరిస్టులు జరిపిన దాడిలో 900 మంది వరకు ఇజ్రాయిల్ ప్రజలు చనిపోయారు. ఇదిలా ఉంటే భారీ స్థాయిలో యుద్ధం చేసేందుకు ఇజ్రాయిల్ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే తాము యుద్ధంలో ఉన్నామని ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యహూ ప్రకటించాడు. యుద్ధం మీరు మొదలుపెట్టారు, తాము ముగిస్తామని హమాస్‌కి వార్నింగ్ ఇచ్చారు.
Israel-Hamas: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి భీకర యుద్ధానికి దారి తీసింది. శనివారం తెల్లవారుజామున హమాస్ మిలిటెంట్లు గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్లతో దాడి జరిపారు. ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ని ఏమార్చి సరిహద్దులు దాటి ఇజ్రాయిల్ పౌరులను చంపారు. పలువురిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు.
Israel: ఇజ్రాయిల్, హమాస్ ఉగ్రవాదులకు మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. శనివారం ఉదయం ఇజ్రాయిల్ పైకి హమాస్ ఏకంగా 5000 రాకెట్లతో గాజా స్ట్రిప్ నుంచి దాడి నిర్వహించింది. ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి వందల సంఖ్యలో ఇజ్రాయిల్ పౌరులను బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లారు.