హమాస్‌లోని ఉగ్రవాద శక్తులను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారీ ప్రాణనష్టం జరుగుతోంది.
ఇజ్రాయెల్ ముట్టడి కారణంగా గాజా స్ట్రిప్‌లో ఆహార పరిస్థితి మరింత దిగజారిపోతోందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) మంగళవారం తెలిపింది. గాజా సరిహద్దును త్వరగా తెరవకపోతే, ఇజ్రాయెల్ కళ్లకు గంతలుగా మారిన ఈ ప్రాంతంలో ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడుతుంది.
హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ నిరంతరాయంగా దాడులు చేయడంతో తీవ్రవాద సంస్థ ఉలిక్కిపడినట్లు తెలుస్తోంది. అక్టోబరు 7 నుంచి జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో తొలిసారిగా హమాస్ ఓ వీడియోను విడుదల చేసింది. బాంబు దాడిని ఆపాలనే ఉద్దేశంతో బ్లాక్ మెయిల్ చేయడం కోసం హమాస్ ఈ వీడియోను రూపొందించింది.
Israel-Hamas War: పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఇజ్రాయిల్ బలగాలు సిద్ధమవుతున్నాయి. శనివారం పదాతిదళాలను కలిసిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ.. రెండో దశకు సిద్ధంగా ఉన్నారా..? అంటూ ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Israel-Hamas War: గత శనివారం ఇజ్రాయిల్‌పై క్రూరమైన మారణకాండకు నాయకత్వం వహించిన హమాస్ ఉగ్రసంస్థ కమాండర్‌ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) హతమార్చాయి. డ్రోన్ దాడిలో టాప్ కమాండర అలీ ఖాదీని డ్రోన్ దాడిలో చంపినట్లు శనివారం ఐడీఎఫ్ ప్రకటించింది. ఇతను హమాస్ అత్యంత ముఖ్యమైన ఎలైట్ గ్రూప్ ‘నుఖ్బా’ ఫోర్సుకి చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. అక్టోబర్ 7న గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించిన ఉగ్రవాద బృందానికి అలీ ఖాదీ చీఫ్.
ఇదిలా ఉంటే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ, హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ నుంచి బందీలుగా పట్టుకున్న చిన్న పిల్లల్ని ఆడిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సాయుధులైన ఉగ్రవాదులు ఓ చేతిలో గన్స్, మరో చేతిలో పిల్లల్ని ఎత్తుకుని ఆడిస్తున్నారు. ఈ వీడియోను టెలిగ్రామ్ ఛానెల్ లో ప్రసారం చేశారు.
Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్దంలో ఇజ్రాయిల్ సైన్యానికి కీలక విజయం లభించింది. హమాస్ ఉగ్ర సంస్థ వైమానిక దళాల అధిపతి మరణించినట్లుగా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. గాజా స్ట్రిప్ లో రాత్రిపూట జరిగిన వైమానిక దాడిలో కీలక హమాస్ నేత మరణించినట్లు తెలిపింది.
Israel: కార్లపై పరుపులు, పిల్లల్ని పట్టుకుని తల్లితండ్రులు బతుకజీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. హమాస్ ఉగ్రవాదుల దాడి, పాలస్తీనాలోని గాజా ప్రాంతంలోని ప్రజలకు శాపంగా మారాయి. కేవలం 24 గంటల్లో ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ప్రజలు అక్కడి నుంచి దక్షిణం వైపు కదిలివెళ్తున్నారు. కార్లపై బట్ట
Israel-Hamas War: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి, తర్వాత గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక దళం విరుచుకుపడుతుంది. ఇదిలా ప్రపంచంలో పలు దేశాలు రెండుగా చీలిపోయాయి. కొందరు భారత్, అమెరికా, యూరప్ లోని పలు దేశాలు ఇజ్రాయిల్ కి మద్దతు తెలుపుతుండగా.. ఇరాన్, సౌదీ, సిరియా, లెబనాన్ వంటి ముస్లిం, అరబ్ రాజ్యాలు ప్రత్యేక పాలస్తీనాకు, హమాస్ కి మద్దతుగా నిలుస్తున్నాయి.
China: హమాస్‌పై ఇజ్రాయిల్ యుద్ధం ప్రకటించడంతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయిల్ వ్యక్తుల్ని, యూదుల్ని టార్గెట్ చేస్తున్నారు. హమాస్ శనివారం ఇజ్రాయిల్‌పై భీకర దాడి జరిపింది. పిల్లల్ని, మహిళల్ని, వృద్ధులని చూడకుండా దారుణంగా మారణకాండ కొనసాగించారు. చిన్న పిల్లల తలలు నరికి హత్య చేశారు.