Operation Ajay: ఆపరేషన్ అజయ్ షురూ.. నేడు ఇజ్రాయిల్ నుంచి భారతీయులకు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Ajay: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. రెండు దేశాల్లోనూ వందలాది మంది చనిపోతున్నారు. వేలమంది గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో ఇజ్రాయెల్ నుండి భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభిస్తున్నట్లు విదేశాంగ మంత్రి డా. జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు. పౌరులను తిరిగి తీసుకురావడానికి చార్టర్డ్ విమానాల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆపరేషన్ అజయ్ ద్వారా నేడు ఇజ్రాయిల్ నుంచి భారతీయులకు తరలింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం చేరుకున్న తరువాత వారి వారి ఇళ్లకు చేరుకునే విధంగా ప్లాన్ వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తరలించేందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రత ఏర్పాట్లు పూర్తి చేసారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య వరుసగా ఐదు రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. గాజా నుంచి ఇజ్రాయెల్ పై హమాస్ ఫైటర్లు భారీ దాడులు చేస్తున్నారు. అదే సమయంలో, పాలస్తీనాపై ఇజ్రాయెల్ నిరంతరం దాడి చేస్తూ ప్రతీకారం తీర్చుకుంటుంది. గాజాపై వైమానిక దాడితో పాటు, ఇజ్రాయెల్ సైన్యం కూడా గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇజ్రాయెల్ సైనికులు గాజా సరిహద్దులోకి ప్రవేశించారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం చాలా రోజులు కొనసాగే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇజ్రాయెల్ నుండి తిరిగి రావాలనుకునే భారతీయులు మన దేశానికి తిరిగి రావడానికి వీలుగా ఆపరేషన్ అజయ్ ప్రారంభించబడుతుంది. ఇందుకోసం ప్రత్యేక విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జై శంకర్ మాట్లాడుతూ విదేశాలలో ఉన్న మన జాతీయుల భద్రత, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఆపరేషన్ అజాయిని ప్రకటించే ముందు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యుఎఇ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా సంక్షోభంపై ఇరుదేశాల నేతలు చర్చించారు. జైశంకర్ తన యుఎఇ కౌంటర్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం తర్వాత భారతదేశంతో చర్చలు జరిపిన మొదటి అరబ్ దేశం UAE కావడం గమనార్హం. ఇజ్రాయెల్‌లో దాదాపు 18 వేల మంది భారతీయ పౌరులు ఉన్నారు. చాలా మంది అక్కడ పనిచేస్తున్నారు.. అదే సమయంలో ఇజ్రాయెల్‌లో భారీ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. భారతదేశం ఇజ్రాయెల్ నుండి తన పౌరులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకువస్తుందని మరియు చార్టర్డ్ విమానాల ద్వారా ఇందుకోసం ఏర్పాట్లు చేస్తామని విదేశాంగ మంత్రి ప్రకటించారు.
Daggubati Purandeswari: అమిత్‌షాను కలిసిన లోకేష్.. ఇప్పుడు సమాధానం చెప్పండి..!
Also Read
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!