Israel-Hamas War: “హమాస్‌ని కూల్చేస్తాం”.. క్యాబినెట్ అత్యవసర సమావేశంలో ఇజ్రాయిల్ పీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ లో జరిగిన క్రూరమైన హత్యలకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) బలగాలు వైమానిక దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే భూతల దాడులు నిర్వహించేందుకు సైన్యం సిద్ధమైంది. పాలస్తీనా ప్రజలు గాజా ఉత్తర ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని ఇప్పటికే ఐడీఎఫ్ హెచ్చరించింది.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల క్యాబినెట్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ అధ్యక్షతన అత్యవసరంగా భేటీ అయింది. ప్రతిపక్ష పార్టీ నేత బెన్నీ గాంట్జ్ ఇటీవల ప్రభుత్వంలో చేరారు. ఉమ్మడి ప్రభుత్వ తొలి సమావేశం ఆదివారం జరిగింది. హమాస్‌ని కూల్చేస్తామని ఈ సమావేశంలో నెతన్యాహు ప్రకటించారు. ఈ వీడియోను పీఎం కార్యాలయం షేర్ చేసింది.
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
Read Also: Chandrayaan-3: భారత టెక్నాలజీని అమెరికా కోరింది.. ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే గాజా ప్రాంతాన్ని చుట్టుముట్టిన ఇజ్రాయిల్ ఆర్మీ, భూతల దాడుల కోసం రాజకీయ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర గాజాలోని 10 లక్షల మంది ప్రజలు దక్షిణానికి వెళ్లాల్సిందిగా సైన్యం చెప్పింది. ప్రజలకు ఇచ్చిన డెడ్‌లైన్ కూడా అయిపోవడంతో ఇక దాడికి అంతా సిద్ధం చేసుకుంటోంది ఇజ్రాయిల్ ఆర్మీ. తాము రాజకీయ నాయకత్వంతో చర్చలు జరుపుతున్నామని సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ రిచర్డ్ హెచ్జ్ అన్నారు.
ఇప్పటికే గాజా చుట్టూ 10 మంది సైన్యాన్ని మోహరించింది ఇజ్రాయిల్. సైనిక సామాగ్రిని సిద్ధం చేసుకుంది. శనివారం ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ పదాతిదళాల సైనికులను కలిసి రెండో దశకు సిద్ధంగా ఉన్నారా..? అంటూ భూతల దాడులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ సైనికులు గాజా నగరంలో పాటు ఉత్తర గాజాలోని అన్ని ప్రాంతాల్లోకి వెళ్లి హమాస్ తీవ్రవాదులను మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్టోబర్ 7 నాటి దాడులకు ప్రధాన సూత్రధారి హమాస్ కీలక నేత యాహ్య సిన్వార్ గా గుర్తించింది ఇజ్రాయిల్. అతను మా దృష్టిలో ఉన్నాడంటూ ఇజ్రాయిల్ వార్నింగ్ ఇచ్చింది.. అతడిని చంపేదాక విశ్రమించబోమని చెప్పింది.
בישיבת ממשלת החירום. אנחנו נפרק את החמאס. pic.twitter.com/p7GxXIKS9a
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) October 15, 2023
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!