ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ, జనసేన ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి.
రెవెన్యూ డెఫిషీట్ గ్రాంట్ ద్వారా రూ.10వేల 400కోట్లు ఇచ్చి ఏపీ మీద తనకు ఉన్న అభిమానాన్ని మోడీ చాటుకున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్రం నిధులు ఇస్తే ఎందుకు అని అడగడం విడ్డూరంగా, విచిత్రంగా ఉందన్నారు.
టీడీపీ, జనసేనలతో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తులోనే ఉన్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. టీడీపీని కలుపుకోవాలనే ప్రతిపాదనను పవన్‌కల్యాణ్‌ను తీసుకువచ్చారని.. అదే విషయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు.
వారణాసిలో గంగా నదీ పుష్కరాల నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల సమ్మేళనం' కాశీ తెలుగు సంగమం' కార్యక్రమం నేడు జరగనుంది. "కాశీ తెలుగు సంగమం" పేరుతో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి పలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి.