GVL Narasimha Rao: కేసీఆర్ కొత్త డ్రామాకి తెరలేపారు.. ఏపీని మోసం చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Narasimha Rao Sensational Comments On CM KCR: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సరికొత్త డ్రామాకు తెరలేపారని.. విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేసేందుకు అధికారులను పంపిస్తామని ఆంధ్రా ద్రోహి కేసిఆర్ మాట్లాడుతున్నారని.. ఇప్పటికీ ఆయన ఏపీని మోసం చేస్తూనే ఉన్నారని ఆరోపణలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్, వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఉన్న మాట వాస్తవమేనని.. కేంద్రమంత్రులకు తాము లేఖలు రాస్తున్నామని, వాటికి వారు రిప్లై కూడా ఇస్తున్నారని తెలియజేశారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్‌లో మాట్లాడలేదని.. తానొక్కడినే పార్లమెంట్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై మాట్లాడానని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకు భరోసా కల్పించాలని కేంద్రం ఆలోచిస్తోందని స్పష్టం చేశారు. కేసీఆర్ లాగా డబ్బా కొట్టుకోవడం కోసం తాము పని చేయడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan: విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై తాము కష్టపడుతుంటే.. కేసీఆర్, కేటీఆర్‌లు మాత్రం డబ్బాలు కొట్టుకుంటున్నారని జీవీఎల్ విమర్శించారు. ఈరోజు తెలంగాణ అప్పుల ఊబిలో చిక్కుకుందంటే.. దానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. ఇన్నేళ్ల పాలనలో కేసీఆర్ తమ ఆస్తులు పెంచుకొని, ప్రజలపై అప్పులను నెట్టారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి ఫగన్ సింగ్ కులస్తే చేసిన వ్యాఖ్యలు సంస్థను నిలబెట్టే విధంగా ఉన్నాయయన్నారు. ఆంధ్రాలో అడుగుపెట్టాలని కేసీఆర్ కలలు కంటున్నారని.. ఆంధ్రావాసులపై చేసిన కామెంట్లకు క్షమాపణ చెప్పి, ఆ తర్వాత ఏపీలో కేసీఆర్ అడుగుపెట్టాలని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. రాజకీయాల అవసరం కోసం ఏపీకి వచ్చి ఉద్దరిస్తానడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి ఎన్నో నిధులు రావాలన్న ఆయన.. ఏపీకి నిధులు ఎందుకివ్వడం లేదని కేసీఆర్‌ని ప్రశ్నించారు. ఏపీలో ఉన్న ప్రభుత్వం ఏమో తెలంగాణకు ధైర్యం నిధులు అడగలేకపోతోందని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్‌కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య లాలూచి ఏంటో వారే చెప్పాలని అడిగారు. 6,400 పైగా పవర్ బకాయిలు ఏపీకి ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని నిలదీశారు. విభజన చట్టంలోని న్యాయమైనవి ఏపీకి ఇవ్వడం లేదన్నారు.
Ravi Shastri: టీమిండియాకి మరో యువ సంచలనం దొరికాడు.. అతడు అద్భుతాలు సృష్టిస్తాడు
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మడం లేదని, కేసీఆర్ అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. తెలంగాణాలో ఆర్టీసీని ప్రైవేట్‌పరం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే 40 శాతం నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పెండింగ్ అంశాలను ఎందుకు పరిష్కరించలేదో కేసిఆర్ సమాధానం చెప్పాలన్నారు. 15 రోజుల్లోగా పెండింగ్ బకాయిలు చెల్లించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎలాగో అడగదు కాబట్టే.. ఆ బకాయిలు చెల్లించాలని తాను అడుగుతున్నానన్నారు. ఆ బకాయిలు చెల్లించాకే ఏపీలో అడుగుపెట్టాలన్నారు. ఏపీలో డ్రామాలకు తెరతీస్తే.. తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తెలంగాణాలోని సెటిలర్స్ రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత కోరుకుంటున్నారని.. మీలా దుర్మార్గంగా ఎవరూ ఆలోచించడం లేదని మండిపడ్డారు. పదేళ్లు కాంగ్రెస్ చేసిన దుర్మార్గాన్ని గుర్తించడం లేదన్నారు. మీరు ఓటేసి గెలిపిస్తే.. కాంగ్రెస్ ఏపీ ప్రజల కళ్లల్లో కారం కొట్టిందని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!