GVL Narasimha Rao Sensational Comments On AP Govt: ఆంధ్ర రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర ఏపీలో ‘లా అండ్ ఆర్డర్’పై పూర్తి రిపోర్ట్ ఉందన్నారు. విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటనలో నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. విశాఖలో భూ మాఫియా జరుగుతోందని ఆరోపించారు. విశాఖ భూ దందాపై గత ప్రభుత్వాలు వేసిన సిట్ రిపోర్టులు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా సీఎం జగన్ భూ సెటిల్మెంట్లు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ రిపోర్టులు అడిగితే ఇస్తామని పేర్ని నాని అన్నారని.. అవి ఎప్పుడు ఇస్తారో క్లారిటీ ఇవ్వాలని నిలదీశారు. బాపట్ల జిల్లాలో చిన్న పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుషమని జీవీఎల్ మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల్లో రాక్షస మనస్తత్వం నింపారని.. వైసీపీ అంటే రాక్షస సంత అని ప్రకటించుకోవాలని ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ముఖ్యమంత్రి ఆ పిల్లవాడి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగనవని చెప్పి, సీఎం తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఏపీలో ఇసుక, మైనింగ్‌పై సీబీఐ ఎంక్వరి జరగాలన్నారు. ఏపీలో ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు.
Tadipatri Crime: తాడిపత్రిలో దారుణం.. మద్యం తాగొద్దన్నందుకు నిప్పంటించాడు
ఇంతకుముందు కూడా.. వచ్చే ఎన్నికల్లో తమకు బీజేపీ అండగా ఉంచకపోవచ్చని సీఎం చేసిన వ్యాఖ్యలపై జీవీఎల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ వ్యాఖ్యల్ని తప్పుపెట్టిన ఆయన.. ఏపీలో బీజేపీ ఏనాడూ వైసీపీకి అండగా లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఎదిగేందుకు తాము ప్రయత్నిస్తున్నామని.. వైసీపీకి ఇప్పటివరకు బీజేపీ అండగా ఉందనే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జగన్ చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి భ్రమ రాజకీయాలను జగన్ మానుకోవాలని హితవు పలికారు. వైసీపీతో బీజేపీకి ఎలాంటి లింకులు లేవన్న ఆయన.. వైసీపీతో తాము ఎప్పుడూ పోరాటంలోనే ఉన్నామన్నారు. అమిత్ షా వంటి కీలక నేత రాష్ట్రానికి వచ్చి వైసీపీ అవినీతిని ఎండగడుతూ, అన్ని విషయాలపై స్పష్టంగా మాట్లాడితే… మీరు మళ్లీ డ్రామా రాజకీయాలు మాట్లాడతారా? అని మండిపడ్డారు. అమిత్ షా చెప్పినట్టు విశాఖలో భూదందా నిజమేనని, దమ్ముంటే సిట్ నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Ashes 2023: సూపర్ ఫీల్డ్ సెట్ చేసిన బెన్ స్టోక్స్.. తడిసిపోయిన స్టీవ్ స్మిత్ ప్యాంట్!