గుంటూరులో ఉచితంగా చికెన్ పంపిణీ చేశారు పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు.. బర్డ్ ఫ్లూ వదంతులతో పడిపోయిన చికెన్ అమ్మకాలను తిరిగి పుంజుకునేలా చేసేందుకు సిద్ధమయ్యారు.. నష్టాల పాలైన నేపథ్యంలో, పౌల్ట్రీ పరిశ్రమకు మద్దతుగా రంగంలోకి దిగి చికెన్ తినాలంటున్న ప్రజా ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మరోసారి బయటపడింది. జగన్‌కు జెడ్‌ఫ్లస్ కేటగిరీ భద్రత ఉన్నా.. ఆయనకు పోలీసులు కనీస భద్రత కూడా కల్పించలేదు. వైఎస్ జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో దారిలో ఎక్కడా పోలీసులు పెద్దగా కనబడలేదు. పెద్దగా భద్రత లేకుండానే గుంటూరు మిర్చి యార్డ్‌లో రైతులతో జగన్ సమావేశం అయ్యారు. తన భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతుల దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. తమ హయాంలో వ్యవసాయం ఓ పండగలా మారిందని, రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నేడు గుంటూరు మిర్చి యార్డ్‌కు జగన్ వచ్చారు. మిర్చి రైతుల…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు చేరుకున్నారు. సౌత్ బైపాస్ వద్ద జగన్‌కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సౌత్ బైపాస్ నుంచి ర్యాలీగా గుంటూరు మిర్చి యార్డ్‌కు వైసీపీ అధినేత చేరుకున్నారు. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు, రైతులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. కాసేపట్లో మిర్చి రైతులతో మాజీ సీఎం జగన్ మాట్లాడనున్నారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. ఏపీలో కూటమి పాలనలో గిట్టుబాటు ధర…
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గంట ముందే గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు మిర్చి యార్డ్‌కు బయలుదేరేందుకు షెడ్యూల్ ఖరారు కాగా.. తాజాగా ఓ గంట ముందే (9 గంటలకు) వెళ్లేలా షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఉదయం 10 గంటలకు మిర్చి యార్డ్‌కు వద్దకు చేరుకుని.. గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులతో జగన్…
గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగి అక్రమ సంబంధాల వ్యవహారం రోడ్డుకెక్కింది. తన భర్త పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని.. తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ కుమార్‌పై అతని భార్య అనసూయ ఫిర్యాదు చేసింది. భార్య అనసూయ ఫిర్యాదుతో పాటు డీఐజీ కిరణ్ అక్రమ సంబంధాల ఫోటోలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే తన భార్యతో ఆరు సంవత్సరాలుగా ఎలాంటి సంబంధం లేదని, పెద్దల సమక్షంలో తెగతెంపులు చేసుకున్నామనిడీఐజీ కిరణ్ చెబుతున్నాడు.…
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీ మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను పల్లె వెలుగు బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ఏడుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మినుము చేను పీకడానికి సుద్ధపల్లి నుండి కంతేరుకు 10 మంది మహిళా కూలీలు ఈరోజు ఉదయం ఆటోలో బయల్దేరారు. చేబ్రోలు మండలం…
First GBS Death In AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి జీబీఎస్ మరణం సంభవించింది. ప్రకాశం జిల్లాలోని కొమరఓలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళ గులియన్ బారే సిండ్రోమ్ వ్యాదితో చికిత్స సోకడంతో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. కొద్దిసేపటి క్రితం మృతి చెందింది.
Bird Flu Outbreak: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ అమ్మకాలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంలో మాంసానికి దూరంగా ప్రజలు ఉండటంతో.. 75 శాతం చికెన్ అమ్మకాలు పడిపోయాయి. అయితే, గుంటూరులో మాత్రం చికెన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.
గుంటూరు జిల్లా మంగళగిరి మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. దాదాపుగా ఐదు కిలోల బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. శనివారం రాత్రి మంగళగిరి మండలం ఆత్మకూరు అండర్ పాస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగు కేజీల 900 బంగారం దోచుకెళ్లారని భాదితుడు ఫిర్యాదు చేశాడు. సుమారు రూ.4 కోట్ల విలువైన బంగారం ఉంటుందని పోలీసులకు తెలిపాడు. విజయవాడ డీవీఆర్ జ్యూవెలరీ షాపు నుంచి మంగళగిరికి యజమాని రాము బంగారం తీసుకు వస్తున్న క్రమంలో మరో…