మళ్లీ చెప్తున్నా, రాబోయే కాలాన్ని ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ శాసిస్తుంది... మన ఆస్తి ఎంత అని కాదు.. మన దగ్గర ఎంత డేటా ఉందని ఆలోచించాలి.. సైన్స్ కు టెక్నాలజీ జోడిస్తే అద్భుతాలు చేయవచ్చు... టెక్నాలజీతో సామాన్య వైద్యులు కూడా అద్భుతంగా ఆపరేషన్ లు చేయవచ్చు అని సూచించారు సీఎం చంద్రబాబు..
రేపు గుంటూరులో సీఐడీ విచారణకు హాజరు కాలేనని సీఐడీకి సమాచారం సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ సమాచారం ఇచ్చాడు. సారీ మూవీ ప్రమోషన్ లో ఉన్న కారణంగా హాజరు కాలేను అని తెలిపాడు. ఈ నెల 28న సినిమా రిలీజ్ ఉండటంతో బిజీగా ఉన్నట్టు పేర్కొన్నాడు. 8 వారాల సమయం కోరాడు. 8 వారాల తర్వాత డేట్ ఇస్తే విచారణకు హాజరు అవుతామని సీఐడీకి తెలిపాడు. సీఐడీ ఇన్‌స్పెక్టర్ తిరుమల రావుకి వాట్సాప్ ద్వారా సమాచారం…
గుంటూరు జిల్లాలోని, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో టిడిఆర్ బాండ్ ల పేరుతో భారీ అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. 10 కోట్ల రూపాయల అక్రమాలు బయటపడ్డాయని తెలిపారు. రోడ్ల విస్తరణ పేరుతో, ఈ టిడిఆర్ బాండ్ల అక్రమాలు జరిగాయని, విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. కొన్ని చోట్ల రోడ్ డెవలప్మెంట్ ప్లానింగ్ లేకుండానే, టిడిఆర్ బాండ్లు విడుదల చేశారని, డోర్ నెంబర్లు మార్చి, తక్కువ ధర పలికే స్థలానికి కూడా ఎక్కువ దరలకు టీడీఆర్ బాండ్లు ఇచ్చారని, విజిలెన్స్…
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం తెనాలి పట్టణం సుల్తానాబాద్ లో వడ్డెర కాలనీ, సుగాలి కాలనీ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, తెనాలి డి.ఎస్.పి బి జనార్ధన రావు నేతృత్వంలో ఈ ప్రాంతంలోని దాదాపు 350 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని నలుగురు సీఐలు, ఎస్ఐలతో సహా 160 మంది దాకా సిబ్బంది…
ప్రేమ పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకపు యువతులను లోబర్చుకుని ప్రాణాలు తీస్తున్నారు. చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఈ క్రమంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు సచివాలయ ఉద్యోగి రాజారావు. అంతేకాదు. యువతిని వదిలించుకునేందుకు జనవరి 15న ఎలుకల మందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించి రాక్షసత్వం ప్రదర్శించాడు రాజారావు. తనను మోసం చేసిన సచివాలయ ఉద్యోగి రాజారావుపై భాదితురాలు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ఎన్నికలు 2025 ఫిబ్రవరి 27న జరగనుండగా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఫిబ్రవరి 3న నుంచీ నామినేషన్లు స్వీకరణ ప్రారంభమవగా ఫిబ్రవరి 10వ తేదీ వరకు తమ నామినేషన్లు సమర్పించవచ్చు. ఇక ఇదిలా ఉండగా గుంటూరు పట్టణ పరిధిలో ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు పేరుతో ఓటర్ జాబితాలో ఓటు నమోదు కావడంతో ఒక్కసారిగా…
South Coastal Zone: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద మైలురాయిగా మరో కొత్త రైల్వే జోన్ ఏర్పాటయ్యింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఈ నిర్ణయంతో విశాఖపట్నం రైల్వే డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో భాగం చేశారు. ప్రస్తుతం ఉన్న వాల్తేర్ రైల్వే డివిజన్‌ను విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మారుస్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు,…
Robbery: గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ ఘటన కలకలం రేపింది. పట్టణంలోని డీ మార్ట్‌కు కుటుంబ సభ్యులతో వచ్చిన ముత్యాల లక్ష్మి (55) అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆమె చేతి బ్యాగ్‌ను లాక్కుని పరారయ్యారు. సరుకులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, రాంగ్ రూట్లో వాహనంపై వచ్చి బ్యాగ్ అపహరించి అక్కడినుంచి పారిపోయారు. బ్యాగ్‌లో రూ. 30 వేల నగదు…
గుంటూరులోని KL యూనివర్సిటీపై సీబీఐ కేసు నమోదు చేసింది.. యూనివర్సిటీ అధికారులు న్యాక్ (NAAC) అక్రిడేషన్ కోసం లంచాలు ఇచ్చిన ఘటనలో కేసు నమోదైంది. A++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చినట్లు సీబీఐ తేల్చింది. వర్సిటీ వీసీ, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ తో పాటు మొత్తం10మంది అరెస్ట్ చేసింది.. విశాఖ, ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు విజయవాడలోని కేఎల్‌యూ పరిపాలనా భవనం, వడ్డేశ్వరంలోని క్యాంపస్‌లో సోదాలు చేపట్టారు. నిన్న రాత్రి 10 గంటల…
గుంటూరు తూర్పు నియోజక వర్గం, ఆర్టీసీ కాలనీలో టీడీపీలో బయటపడ్డ వర్గ విబేధాల ఘటనలో కేసు నమోదు అయింది. టీడీపీలోని ఒక వర్గం ఎమ్మెల్యేపై దాడి చేయడానికి ప్రయత్నం చేసిందని, తన మీద కూడా దాడికి వచ్చారని మహిళా కార్యకర్త మొవ్వ శైలజ పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగర ఉపాధ్యక్షుడు ఫిరోజ్‌తో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీలోని రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడంతో…