కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, “మా బావ ప్రభాస్. బావ, బావ అని అనుకుంటూ ఉంటాం మేం ఇద్దరం కొన్ని సంవత్సరాలుగా. మా సినిమా చేశాడని చెప్పడం లేదు. చేసినా, చేయకపోయినా, మంచివాడు, మానవత్వం ఉన్నవాడు, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్,” అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. Also Read : Mohan Babu: కన్నప్ప కోసం నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు అనేది నేను చెప్పదలచుకోలేదు!…
కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, “మా అమ్మగారికి సంతానం లేదు. రెండు మూడు సార్లు గర్భం నిలవకపోవడం వల్ల ఆవిడకు పుట్టుకతో రెండు చెవులు లేవు. నాన్నగారేమో ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన ఒక నాలుగు కిలోమీటర్లు కొలనులో నడిచి వెళ్లి, ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు ఫారెస్ట్‌లో నడిచి వెళ్లాలి. ఆ తర్వాత నాలుగైదు కిలోమీటర్ల కొండ ఎక్కాలి. అక్కడ లింగాకారంలో ఈశ్వరుడు. శ్రీకాళహస్తిలో ఎలా…
కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ, “మా కన్నప్ప ఫస్ట్ రోడ్ షో ఇదే, గుంటూరులో జరిగింది. దానికి థాంక్స్. ఈ రోజు కన్నప్ప సినిమా చేసి ఈ రోజు ముందు నిలబడడానికి చాలా మంది సహకరించారు. నాకు మా నాన్న దేవుడు, ఆయన లేకపోతే నేను లేను. ఆయనకు మొదటి థాంక్స్. ఇక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నా మిత్రుడు ప్రభాస్‌కి…
కేసులును నేను వెనకేసుకురావడం లేదు.. కానీ, మీరే జడ్జిమెంట్ ఇవ్వకూడదు అని పోలీసులు, ప్రభుత్వానికి సూచించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. గుంటూరు జిల్లా తెలానిలో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న రాకేష్, జాన్ విక్టర్, బాబూలాల్ ను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. కోర్టులో హాజరుపర్చే ముందు హాస్పిటల్ కు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది..
ఇదే చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులున్నాయని ఆయనను రోడ్డుపైకి తీసుకొచ్చి కొడితే ధర్మమేనా? అనిఅడుగుతున్నాను అంటూ ప్రశ్నించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన ఆయన.. లో వైఎస్ జగన్.. జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ సహా ముగ్గురుని, వాళ్ల కుటుంబాలను పరామర్శించారు..
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు బెంగుళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి.. సాయంత్రం 5.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి వైఎస్ జగన్ చేరుకుంటారు. Also Read: Alluri Seetharamaraju: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. పెళ్లి బృందం ప్రాణాలు కాపాడిన బండరాయి మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో…
గుంటూరు వెస్ట్.. రాజకీయంగా మంచి ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. కానీ... ఇక్కడ ఇన్ఛార్జ్ని నియమించుకోలేక సతమతం అవుతోందట వైసీపీ. అలాగని.... పార్టీకి ఇక్కడ నాయకుల కొరతేం లేదు
తూర్పు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ వరకూ ద్రోణి వ్యాపించింది. కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల…
ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ అనంతపురంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా.. జాతీయ జెండా చేత పట్టుకుని నగర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్.. ఎమ్మెల్యేలు దగ్గుపాటి, పల్లె సింధూర, బండారు శ్రావణి ఇతర ప్రజా ప్రతినిధులు సహ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ ,మాజీ సైనికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ నుండి…
గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాస లేడీస్ హాస్టల్లో సీసీ టీవీ కెమెరాల వ్యవహారం కలకలం రేపింది. హాస్టల్లోని బాత్రూం వద్ద సీసీ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాత్రి వేళల్లో హాస్టల్ కి బయట వ్యక్తులు వస్తున్నారని పేర్కొన్నారు.