గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది.. పలువురు వీఐపీల దగ్గర బౌన్సర్ గా పని చేసే కోటేశ్వరరావు అనే వ్యక్తిని హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. కోటేశ్వరరావు పీక కోసి హత్య చేసి పరారయ్యరు.. మృతుడు కోటేశ్వరరావు గతంలో పవన్ కల్యాణ్ తోపాటు, పలువురు సెలబ్రిటీల వద్ద బౌన్సర్ గా పని చేశాడని స్థానికులు చెబుతున్నారు..
గుంటూరు జిల్లాలో రైల్వే, జిల్లా కోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గుంజి శ్రీనివాస్ రావు అనే వ్యక్తి మోసం చేశాడని భాదితులు ఫిర్యాదు చేశారు. పదిమంది వద్ద సుమారు కోటి రూపాయలు వసూలు చేశాడని చిలకలూరిపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావుపై ఆరోపణలు వచ్చాయి.
అవినీతి లేకుండా పంచాయితీ వ్యవస్థని బలోపేతం చేసుకునే విధంగా గ్రామ సభలు జరగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురంలో గ్రామ సభలో పాల్గొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గ్రామ సభలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించి , వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ కేసులో నిందితుడిని విచారిస్తుండగా గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని 21.096 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. నర్సుగా పని చేస్తున్న కావ్య(23) అనే యువతిపై బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కావ్యకు గాయాలు అయ్యాయి.
గుంటూరు జిల్లా తెలుగు యువత క్యాడర్‌తో గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత కదిలితే ప్రభుత్వాలు మారతాయని.. అదే యువత రగిలితే ప్రభుత్వాలు కుప్పకూలుతాయని అన్నారు.