గుంటూరు జిల్లా పేకాటకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందా? నేతల అండ.. ఖాకీల ఆశీస్సులు నిర్వాహకులకు కలిసి వస్తున్నాయా? కొండలు.. గుట్టల్నే డెన్లుగా మార్చేస్తున్నారా? రోజుకో చోట సిట్టింగ్ ఏర్పాటు చేసుకుని ఎవరికీ దొరకకుండా షోలు నడిపిస్తున్నారా? వడ్డించేవాడు మనవాడే అయితే చాలన్నట్టుగా వ్యవహారాలు సాగిపోతున్నాయా? గుంటూరు జిల్లాలో పేకాటలకు లోకల్ ఖాకీల అండ? గుంటూరు జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పేకాట కామన్. పోలీసుల దాడులు రొటీన్. కానీ.. ఏదో ఇద్దరిని పట్టుకోవడం.. నాలుగువేలు స్వాధీనం…
గుంటూరు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. తల్లీకూతుళ్లను సొంత చిన్నాన్న కొడుకే కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. సత్తెనపల్లిలోని నాగార్జుననగర్‌లో ఇంట్లో ఉన్న తల్లి, కూతుళ్లు వెంకట సుగుణ పద్మావతి, కూతురు లక్ష్మీ ప్రత్యూషను నిందితుడు శ్రీనివాసరావు అతి దారుణంగా హత్య చేశాడు. . దుండగుడు ఇద్దరు మహిళల్ని అత్యంత కిరాతకంగా చంపుతోన్న దృశ్యాలను వీడియో తీశారు చుట్టపక్కల వాళ్లు. కత్తితో పొడుస్తున్న దుర్మార్గుడితో తల్లీకూతుళ్లు పెనుగులాడుతున్న దృశ్యాలు కలకలం రేపాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా…
ఏపీలోని వివిధ జిల్లాల వ్యాప్తంగా 23 చోరీ కేసులు చేసిన గజదొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పెదగొన్నూరులో నిందితుడు గుబిలి సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితుడు ప్రధానంగా సీసీ కెమెరాలు, వైఫై రౌటర్లు, డీవీఆర్ లు చోరీ చేసేవాడని తెలిపారు. అంతేకాదు చోరీల్లో సుబ్రహ్మణ్యం చాలా ప్రత్యేకమైన వ్యక్తి.. ఖద్దరు చొక్కా, తెల్ల పంచె ధరించి దొంగతనాలకు వెళ్లేవాడని వివరించారు.సీసీ కెమెరాల దొంగతనం బోర్ కొట్టిందో లేక పెద్ద దొంగతనంతో సెట్ అయ్యిపోవాలి…
గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఈ రోజు జరిగిన రమ్య హత్యా ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించామని గౌతం సవాంగ్ తెలిపారు.ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారని ఆయన తెలిపారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని..…
గుంటూరులో సంచలనం రేపిన రేవ్ పార్టీ వ్యవహారం పోలీసుల వ్యవహారశైలిని బయటపెట్టింది. లక్ష్మీపురంలోని ఓ బిల్డింగ్ నుంచి… అరుపులు, కేకలు వినిపించడంతో… విసిగిపోయిన స్థానికులు… అక్కడికి వెళ్లి చూశాడు. రేవ్ పార్టీ జరుగుతుండడంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, అక్కడున్న పోలీస్ అధికారి… వారికి వార్నింగ్ ఇచ్చి పంపారు. ఇలా కాదనుకున్న స్థానికులు… ఆ బాగోతాన్ని వీడియో తీశారు. ఆ తర్వాత.. పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పాతిక మంది గుంపు తమ ఇంటి దగ్గర రేవ్…
గుంటూరు జిల్లాలో కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు చేస్తున్నారు అధికారులు. భయం గుప్పిట్లో కరోనా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా కంటోన్మెంట్ జోన్లలో బిగుసుకుంటున్నాయి బారికేడ్లు. గడిచిన పది రోజులుగా ఆ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో కంటైన్న్మెంట్ జోన్లలో బారికేడ్లు కట్టారు అధికారులు. ఫలితంగా జిల్లాలో వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ కరోనా విరుచుకుపడుతున్న హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు… ఎక్కడ కరోనా కేసులు నమోదైతే అక్కడ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు.. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిషా రాష్ట్రానికి చెందిన కూలీల మృతిపై మావనతాదృక్పథంతో స్పందించిన సీఎం.. మృతి చెందిన ఆరుగురు కూలీలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి మన రాష్ట్రానికి వచ్చి అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతా దృక్పథంతో సాయం అందించాలన్నారు సీఎం.. ఇక,…
పేకాట పేకాటే.. అనుచరులు అనుచరులే. ఇదే ఇప్పుడు గుంటూరు జిల్లా వైసీపీ, పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్. ఇటీవల జరిగిన ఓ ఘటన ఏకంగా ఖాకీలకు చుక్కలు చూపించిందట. నేతల ఒత్తిళ్లు తట్టుకోలేని పోలీసులు పేకాట ఆడుతూ దొరికిన వాళ్లను వేరే జిల్లాలో వదిలేయాల్సి వచ్చింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. రూటు మార్చిన పేకాట మాఫియా! గుంటూరు జిల్లా పేకాటకు హబ్‌గా మారింది. జిల్లాలో కొంతమంది అధికారపార్టీకి చెందిన నేతలు పేకాట ఆడిస్తున్నారని ఓపెన్‌గానే చెబుతున్నారు.…
దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో ఏపీలోని గుంటూరులో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. గుంటూరులో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ. 100.06 కు చేరింది. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇంకా పెరుగుతూ పోతుండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.