CM Jagan: ఏపీ సీఎం జగన్ జోరుగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ ఈనెల 11న పల్నాడు, గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్ధ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం గుంటూరు జిల్లాలో ఆయన పర్యటిస్తారు. ఈ మేరకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన…
Telugu Lady Inspirational Story: మనిషికో చరిత్ర. కానీ.. అందరివీ అంత ఆసక్తికరంగా ఉండవు. ఆదర్శంగా అసలే అనిపించవు. అయితే.. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన లక్ష్మి అనే మహిళది మాత్రం సూపర్ హిట్ సినిమాకు మించిన ఇంటస్ట్రింగ్ స్టోరీ. ఇన్‌స్పిరేషనల్ స్టోరీ. చదువు మానేసిన 30 ఏళ్ల తర్వాత 49 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్‌లో చేరి 53 ఏళ్ల వయసులో విజయవంతంగా కోర్సు పూర్తి చేశారు.
ఏపీ సీఎం జగన్ మంగళవారం నాడు గుంటూరు, పల్నాడు జిల్లాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సీఎం టూర్ షెడ్యూల్‌ను ప్రకటించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ ఉ.10:40 గంటలకు గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లోని సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. డాక్టర్ వైయస్‌ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్‌లను, హర్వెస్టర్‌లను సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు…
నయా ప్రపంచంలో అమ్మాయిలు తెలివి మీరారు. గతంలో అయితే మాటలతో మత్తెక్కించి మాయ చేసేవాళ్లు. ఇప్పుడు మోడ్రన్ డ్రస్సులతో అట్రాక్ట్ చేస్తూ అమ్మాయిలు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇదే ఫార్ములాను కొంతమంది గుజరాత్ అమ్మాయిలు గుంటూరు జిల్లాలో అమలు చేస్తున్నారు. ఊరు చివరల్లో కాపు కాసి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను అడ్డగించి వాళ్ల జేబులకు చిల్లు పెడుతున్నారు. Loan Apps Harassments: లోన్ యాప్‌ల వేధింపులు.. యువతి బలవన్మరణం వివరాల్లోకి వెళ్తే.. పెదకాకాని పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్…
గుంటూరు జిల్లా తాడికొండ సబ్‌స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అసని తుఫాన్ వల్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరిస్తున్నారు. దీంతో సబ్‌స్టేషన్‌లో మంటలు భారీగా చెలరేగడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై తాడికొండ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అసని తుఫాన్ కారణంగా ఏపీలోని పలు…
గుంటూరు జిల్లాలోని పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయం క్యాంటీన్‌లో మాంసాహారం వండిన ఘటన కలకలం రేపింది. ఇది సున్నితమైన అంశం కావడం, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో దేవాదాయ శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆలయంలోని క్యాంటీన్ మూసివేసి, దాన్ని లీజుకు తీసుకున్న నిర్వాహకుల లైసెన్స్ రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మాంసాహారం బయటే వండారని, దానికి సంబంధించిన రిక్షా ఆలయ ప్రాంగణంలోకి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై గురువారమే నిర్వాహకులకు…
ఏపీలో జిల్లాల విభజనతో పలు జిల్లాల భౌగోళిక స్వరూపం మారిపోయింది. ఏపీలో గతంలో ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు వచ్చాయి. ఇదివరకు రాయలసీమలో 4, కోస్తాలో 9 జిల్లాలు అని సులభంగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో చెప్పడం కష్టమైన పనే. ఈ విషయంపై స్పష్టత రావడానికి కాస్త సమయం పడుతుంది. అయితే జిల్లాల పునర్విభజనతో రాష్ట్రంలో చాలా మార్పులు జరిగాయి. ఇదివరకు సముద్రతీరం ఉన్న గుంటూరు జిల్లాలో జిల్లాల…
గుంటూరు జిల్లాలో నకిలీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. రోజుకో ప్రాంతంలో నకిలీ నోట్లు బయటపడుతుండడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఒరిజినల్ నోట్లకు నకిలీ నోట్లకు తేడా తెలియకపోవడంతో జనం మోసపోతున్నారు. కొందరు కేటుగాళ్ళు ఈజీ మనీకోసం నకిలీ కరెన్సీ చలామణి చెయ్యడం మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని నకిలీ కరెన్సీ చలామణి చేస్తూ జనాన్ని నిలువునా మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. భారీ మొత్తంలో నకిలీ నోట్లు ప్రింటింగ్ చేసి మార్కెట్లోకి చలామణిలోకి తెస్తున్నారు. వినుకొండ…
ఒక్కొక్కరికి ఒక్కో అభిమానం ఉంటుంది. కొందరికి సినిమా స్టార్లు అంటే పిచ్చి. ఇంకొందరికి రాజకీయ నేతలంటే అభిమానం. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఏపీలోనూ అభిమానులు ఉన్నారు. దీంతో కేటీఆర్ సీఎం కావాలంటూ ఏపీలోని ఓ అభిమాని బైక్ యాత్ర చేపట్టాడు. గుంటూరు జిల్లాకు చెందిన బాలరాజుగౌడ్ అనే వ్యక్తి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లా మాచర్ల నుంచి యాదాద్రి వరకు బైక్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. తన బైక్…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్.ఆర్.ఆర్ సినిమా మేనియా నడుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీ ఈనెల 25న విడుదల కానుంది. ఈ సినిమా టిక్కెట్ బుకింగ్స్ అప్పుడే ప్రారంభం కాగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు వ్యాపారులు ఆర్.ఆర్.ఆర్ మూవీ క్రేజ్‌ను వినియోగించుకుంటున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ వినూత్నంగా ఆలోచించింది. సింగిల్ గ్యాస్ సిలిండర్ కలిగిన వినియోగదారులు…