తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో సమావేశం సమావేశమయ్యారు వైసీపీ అధినేత జగన్.. సమావేశానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, మేరుగు నాగార్జున, వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ప్రమాదకరమైన ధార్ గ్యాంగ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో మకాం వేసిందా.. వరుస దొంగతనాలు ఆ గ్యాంగ్ పనేనా..? పల్నాడు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది ఈ ప్రశ్న.. పగలంతా రెక్కీ చేస్తారు, తాళాలు వేసిన ఇళ్లకు కాపలా పడుకుంటారు.. సరిగ్గా సమయం కుదిరింది అనుకుంటే ఇల్లు గుల్ల చేసేస్తారు.. సెల్ఫోన్ వాడరు, సిగ్నల్ దొరకనివ్వరు, తమ మొహాలు కనపడనివ్వరు..
ఆ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేశాడు తాడేపల్లి మండలం పాతూరు గ్రామానికి చెందిన అంజిబాబు అనే ఇండియన్ బ్యాంకు ఖాతాదారుడు.. అయితే, డిపాజిట్ చేసిన నోట్లలో 18 వేల రూపాయల దొంగ నోట్లు ఉండడంతో అకౌంట్‌లో ఆ మొత్తం జమ కాలేదు.. ఇక, తాను 50,000 డిపాజిట్ చేయగా అందులో 18,000 డిపాజిట్ అవ్వలేదని బ్యాంకు మేనేజర్ కు సదరు ఖాతాదారుడు ఫిర్యాదు చేశాడు.
గుంటూరు జిల్లా తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి మేరీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు కాలనీలో ప్రభుత్వ స్థలం శుభ్రం చేసి పార్కును ఏర్పాటు చెయ్యాలని ఆలోచనలో మున్సిపల్ అధికారులు ఉన్నారు.
గుంటూరు జిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది.. స్కూల్ లో విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదంతో ఓ బాలుడి హత్యకు దారి తీసింది.. తాడికొండ మండలం పొన్నెకల్లులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.. విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదంతో తోటి విద్యార్థిని కొట్టి చంపి బావిలో పడేశారు సహచర విద్యార్థులు.. ఈ ఘటనతో తీవ్ర విషయంలోకి వెళ్లిపోయింది సదరు విద్యార్థి కుటుంబం.. గత నెల 24వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన…
అత్యంత ప్రమాదకరమైన డెవిల్ ఫిష్ (దెయ్యపు చేప) గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరులోని చేపల చెరువులో ప్రత్యక్షమైంది. నదులు, సముద్రాలకే పరిమితం కావాల్సిన ఈ చేపలను చూసి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల రాచ మర్యాదలు అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఓ రెస్టారెంట్‌లో విందు భోజనం అంటూ పోలీసులపై విమర్శలు వెల్లివెత్తాయి.. ఇక, టీడీపీ కార్యకర్తలు సెల్‌ఫోన్‌లో ఈ వ్యవహారాన్ని వీడియో చిత్రీకరిస్తుండగా.. ఫోన్ లాక్కుని వీడియో డిలీట్ చేశారంటూ పోలీసులపై మండిపడ్డారు.. ఈ వ్యవహారం అంతా వివాదాస్పదం కావడంతో.. పోలీసులపై వేటు పడింది
ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది. మహిళా రైతు నుండి రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గుంటూరు జిల్లాలోని అంకిరెడ్డిపాలెం వీఆర్వో షేక్ హసీనా బేగం పట్టుబడింది. చెరుకూరి ప్రమీలా రాణి అనే మహిళ రైతు నుండి పాస్ పుస్తకాల పేరు మార్పు కోసం రూ.2 .50 లక్షల డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లాలోని తెనాలిలో నవీన్ అనే యువకుడు దాడి లో తీవ్ర గాయాలపాలై బ్రెయిన్ డెడ్‌కు గురైన సహానా మృతి చెందింది. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సహానా ప్రాణాలు విడిచింది. మృతురాలు సహానాకు నిందితుడు నవీన్‌కు ప్రేమ వ్యవహారం ఉంది.
గుంటూరు జిల్లాకు చెందిన మహేష్, కృష్ణా జిల్లాకు చెందిన శైలు.. హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు.. అక్కడ ప్రారంభమైన వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి పెద్దలకు కనపడకుండా వెళ్లిపోయారు.. దీంతో.. యువతి సైలు కుటుంబ సభ్యులు నందిగం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రేమజంట.. తమ ప్రేమకు పెద్దలు అడ్డుగా వస్తారని భావించి, భయపడి ఈ తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డినట్టుగా తెలుస్తోంది.