Konda Surekha : హనుమకొండ అటవీ శాఖ ఆధ్వర్యంలో హంటర్ రోడ్డు లోని జూ పార్కులో రెండు పులులను, అడవి దున్నలను, అదేవిధంగా ఇతర జంతువులను ప్రజల సందర్శనార్థం ప్రారంభించారు రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమానికి మేయర్ గుండు సుధారాణి పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..…
పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కీలక నేతలు ఆ పార్టీ కి గుడ్ బాయ్ చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పదవులను అనుభవించిన నేతలు ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చి కాంగ్రెస్, బీజేపీలోకి వెళుతున్నారు.
నన్నపనేని నరేందర్.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే. ఇంకొకరు బస్వరాజు సారయ్య, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ. మూడో వ్యక్తి గుండు సుధారాణి, వరంగల్ మేయర్. ఈ ముగ్గురి మధ్య వరంగల్ తూర్ప టీఆర్ఎస్ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. కోల్డ్‌వార్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకరంటే ఒకరికి పడదు. ముగ్గురి మధ్య అనేక సందర్భాలలో అభిప్రాయభేదాలు బయటపడ్డాయి కూడా. గత ఏడాది దసరా సమయంలోనే రచ్చ రచ్చ అయింది. తాజాగా పట్టణ ప్రగతి కార్యక్రమం ఆ వర్గపోరును పీక్స్‌కు తీసుకెళ్లడంతో…
గ్రేటర్ వరంగల్ టీఆర్‌ఎస్‌లో కొత్త కుంపటి రాజుకుందా? ఇప్పటికే మేయర్, ఎమ్మెల్యేల మధ్య దూరం పెరగ్గా.. ఇప్పుడు కార్పొరేటర్లతోనూ మేయర్‌కు పడటం లేదా? నగరబాట నగుబాటగా మారుతోందని సొంత పార్టీ నేతలే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారా? గుండు సుధారాణి. ఈ మాజీ ఎంపీ.. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మేయర్. ఈ మధ్య నగరబాట కార్యక్రమాన్ని చేపట్టారు మేయర్. వెంటనే టీఆర్‌ఎస్‌కే చెందిన కార్పొరేటర్లు కయ్యిమన్నారు. మేయర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు నాయకులు. వరంగల్ అభివృద్ధిలో ఇప్పటికే…
వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిఫ్ట్ లో ఇరుక్కోవడం కలకలం రేపింది.. హన్మకొండలో చౌరస్తాలో ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళిన గుండు సుధారాణి లిఫ్ట్ లో ఇరుకున్నారు. హాస్పిటల్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా హజరై, తిరిగి వచ్చే క్రమంలో ఆమె లిఫ్ట్ లో ఇరుక్కోవడం కలకలం రేపింది. బిల్డింగ్ యాజమాని నిపుణులను రప్పించి లిఫ్ట్ ని రిపేర్ చేయించారు. సుమారు 10 నిమిషాల పాటు మేయర్ సుధారాణి అందులోనే ఉండిపోయారు. ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో…