ఇసుక దోపిడీ కోసమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గుండ్లకమ్మ గేట్లను విరగొట్టారు అంటూ సంచలన ఆరోణలు చేశారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పాలకులు గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయినా చోద్యం చూస్తూ కూర్చున్నారు.. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఎనిమిదిన్నర కోట్ల రూపాయాల నిధులు కేటాయించి.. గేట్లు మరమ్మత్తులు చేపడుతున్నాం అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్..