Minister Gottipati Ravikumar: ఇసుక దోపిడీ కోసమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గుండ్లకమ్మ గేట్లను విరగొట్టారు అంటూ సంచలన ఆరోణలు చేశారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. బల్లికురవలో ఈర్ల గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం సాగు నీటి సంఘాల కమిటీ సభ్యులతో మాట్లాడి దిశానిర్దేశం చేవారు.. ఎండాకాలం పూర్తి అయ్యేలోపు కాలువ పూడికతీత, మరమత్తులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక, ఈ సందర్భంగా మంత్రి గొట్టి పాటి మాట్లాడుతూ.. వ్యవసాయం సీజన్ నాటికి పంట కాలువలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.. గుండ్లకమ్మ చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో పాటు రైతాంగాన్ని కాపాడుకుంటాం అన్నారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ కోసమే గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లను విరగొట్టారని ఆరోపించారు.. గుండ్లకమ్మ నుంచి వైసీపీ నేతలు కోట్లాది రూపాయిల ఇసుక దోపిడీ చేశారని విమర్శించారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరమత్తుల కోసం నిధులు కేటాయించింది. గుండ్లకమ్మ ప్రాజెక్టులో 3 టీఎంసీల నీటిని నిల్వ చేసి 20 లక్షల చేపపిల్లలను వదిలామని వెల్లడించారు.. జలాశయం మీద ఆధారపడి జీవించే వారికి జీవనోపాధి కలిస్తున్నాం అన్నారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్..
Read Also: Nidadavolu Municipality: వైసీపీకి మరో బిగ్ షాక్..! జనసేన ఖాతాలోకి నిడదవోలు..