(మే 16తో ‘వీరకంకణం’కు 65 ఏళ్ళు) నటరత్న యన్టీఆర్ కథానాయకునిగా తెరకెక్కిన జానపద చిత్రం ‘వీరకంకణం’ ఆ రోజుల్లో జనాన్ని భలేగా అలరించింది. 1950లో ఎమ్.జి.రామచంద్రన్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘మంత్రి కుమారి’ ఆధారంగా ఈ ‘వీరకంకణం’ తెరకెక్కింది. ఆ సినిమాను నిర్మించిన మోడరన్ థియేటర్స్ సంస్థ ‘వీరకంకణం’ను తెలుగులోనూ నిర్మించింది. 1957 మే 16న ‘వీరకంకణం’ చిత్రం విడుదలయింది. ‘వీరకంకణం’ కథ ఏమిటంటే- ఓ దేశానికి రాజైన వెంగళరాయ దేవ అమాయకుడు. తమ రాజగురువు…
నటరత్న యన్.టి.రామారావు హీరోగా ఎ.సి.త్రిలోక్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పవిత్ర హృదయాలు’ చిత్రం పార్ట్ లీ కలర్ లో రూపొందింది. 1971లో యన్టీఆర్ నటించిన ఎనిమిదవ చిత్రమిది. ఆ యేడాది తెలుగునాట రంగుల చిత్రాల హవా విశేషంగా వీచడం మొదలయింది. ఈ నేపథ్యంలో ‘పవిత్ర హృదయాలు’లో కొన్ని పాటలు రంగుల్లో దర్శనమిచ్చాయి. అనేక చిత్రాలలో యన్టీఆర్ కు చెల్లెలిగా నటించిన చంద్రకళ, ‘మాతృదేవత’ చిత్రంలో కూతురుగానూ అభినయించింది. యన్టీఆర్ సరసన నాయికగా ఆమె తొలిసారి ‘తల్లా?పెళ్ళామా?’లో నటించగా,…