ఈ వారం ఓటిటిలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు టాప్ ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రీమియర్ కాబోతున్నాయి. నవంబర్ 4న దీపావళి ఉండగా, ఈ వారంలో విడుదల కానున్న సినిమాలు ఓటిటి ప్రియులకు మంచి ట్రీట్ కానున్నాయి. మరి ఈ వారం ఏఏ సినిమాలు ఓటిటిలో విడుదల కానున్నాయి తెలుసుకుందాం. జై భీమ్ఈ ఇంటెన్సివ్ డ్రామాలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది ‘జై భీమ్’. సామాజిక సందేశంతో…
దీపావళి కానుకగా సినీ ప్రేక్షకులకు ఓటీటీ వేదికగా మరో సినిమా అందుబాటులోకి రానుంది. సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ సినిమా ఓటీటీ డేట్స్ ఫిక్సయింది. ఈ మూవీ నవంబర్ 4 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంలో సందీప్ కిషన్‌కు జోడీగా నేహాశెట్టి నటించింది. కామెడీ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కింది. బాబీ సింహా, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి,…
ఈ యేడాది ఇప్పటికే సందీప్ కిషన్ నటించిన ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’, ‘వివాహ భోజనంబు’ చిత్రాలు విడుదలయ్యాయి. విశేషం ఏమంటే… ఆ రెండు సినిమాలకూ సందీప్ కిషన్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. అందులో మొదటిది మార్చిలో థియేటర్లలో రిలీజ్ కాగా, రెండోది సోనీ లివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా సందీప్ కిషన్ హీరోగా కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘గల్లీ రౌడీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండేళ్ళ…
థియేటర్లు రీఓపెన్ అయినప్పటి నుంచి వరుసగా సినిమాలు విడుదల అవుతున్నాయి. ముందుగా చిన్న సినిమాల నిర్మాతలు ధైర్యం చేసి అడుగు ముందుకేశారు. అంతగా ఫలితం రాలేదు. కానీ రానురానూ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నెమ్మదిగా మీడియం రేంజ్ సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. అందులో అసలు ప్రచారమే జరగని సినిమాలు ఉన్నాయి. భారీగా అంచనాలు ఉన్న సినిమాలూ విడుదల అయ్యాయి. సత్యదేవ్ “తిమ్మరుసు”, తేజ సజ్జ “ఇష్క్” తదితర సినిమాలు రిలీజ్ అయ్యాయి.…
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ “గల్లీ రౌడీ”. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా ‘గల్లీ రౌడీ’ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. ఇక థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది.…
సందీప్ కిషన్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ‘గల్లీ రౌడీ’ ట్రైలర్ రిలీజ్ రేపటికి వాయిదా పడింది. నిజానికి ఈ ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేయాలనుకున్నారు. అయితే సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ వల్ల రేపటికి మారింది. ‘స్టేట్ రౌడీ’ చిరంజీవి గారు ఈ ట్రైలర్ ను ఆదివారం ఉదయం 10.30కి ట్విటర్ లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కోన ఫిలిమ్ ఫ్యాక్టర్, ఎం.వి.వి. సినిమా నిర్మిస్తున్న ఈ సినిమాకు జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం…
మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ప్రేమగా ‘స్టేట్ రౌడీ’ అని గతంలో పిలుచుకునే వారు. ఆ పేరుతో ఆయన ఓ సినిమాలో నటించడమే అందుకు కారణం. ఇంతకూ విషయం ఏమిటంటే… అలనాటి ఆ ‘స్టేట్ రౌడీ’… ఇప్పుడు ‘గల్లీ రౌడీ’ మూవీ ట్రైలర్ ను ఆవిష్కరించడానికి అంగీకారం తెలిపారు. సందీప్ కిషన్ హీరోగా వైయస్ఆర్ సీపీ పార్లమెంట్ మెంబర్ ఎం.వి.వి. సత్యనారాయణ, ప్రముఖ రచయిత కోన వెంకట్ ‘గల్లీ రౌడీ’ మూవీని నిర్మించారు. సెప్టెంబర్ 17న ఈ సినిమా…
సందీప్ కిషన్ టైటిల్ పాత్ర పోషించన ‘గల్లీ రౌడీ’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. సూపర్ హిట్ చిత్రాల రచయిత కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను ఈ నెల 17న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. రాజేంద్ర ప్రసాద్ కీలక…