థియేటర్లు రీఓపెన్ అయినప్పటి నుంచి వరుసగా సినిమాలు విడుదల అవుతున్నాయి. ముందుగా చిన్న సినిమాల నిర్మాతలు ధైర్యం చేసి అడుగు ముందుకేశారు. అంతగా ఫలితం రాలేదు. కానీ రానురానూ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నెమ్మదిగా మీడియం రేంజ్ సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. అందులో అసలు ప్రచారమే జరగని సినిమాలు ఉన్నాయి. భారీగా అంచనాలు ఉన్న సినిమాలూ విడుదల అయ్యాయి. సత్యదేవ్ “తిమ్మరుసు”, తేజ సజ్జ “ఇష్క్” తదితర సినిమాలు రిలీజ్ అయ్యాయి. “తిమ్మరుసు” సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఆ తరువాత చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ “ఎస్ఆర్ కళ్యాణమండపం” హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇటీవల “సీటిమార్” బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది.
Read Also : “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా ?
ఈ వారం అంటే సెప్టెంబర్ 17న కూడా దాదాపు 7 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గల్లీ రౌడీ, మాస్ట్రో, హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ ‘ఫ్రెండ్ షిప్’, ‘జెమ్’, ‘ప్లాన్ బి’, ‘హనీ ట్రాప్’, విజయ్ ఆంటోనీ ‘విజయ రాఘవన్’ రేపు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో మాట్లాడుకోవాల్సింది “గల్లీ రౌడీ”, “మాస్ట్రో”. ఈ రెండు సినిమాలపై మంచి హైప్ ఉంది. ముఖ్యంగా “మాస్ట్రో”. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన “అంధాదున్” సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా ఓటిటి వేదికగా విడుదల కానుంది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈరోజు రాత్రి 12:00 గంటల నుండి ప్రసారం కానుంది. సినిమాకు నభా నటేష్, తమన్నా గ్లామర్ హైలెట్. మరోవైపు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న “గల్లీ రౌడీ”. ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.
ఇక ఈ వారం విడుదల కానున్న సినిమాల్లో ఈ రెండు సినిమాలపైనే అందరి దృష్టి ఉంది. అయితే అందులో “మాస్ట్రో” ఓటిటిలో, “గల్లీ రౌడీ” థియేటర్లో విడుదల కానున్నాయి. దాంతో ఈ వీక్ టాలీవుడ్ వార్ ఓటిటినా ? థియేటరా ? అన్నట్టుగా మారింది. మరి ఇందులో విజేతగా థియేటర్ నిలుస్తుందా ? ఓటిటినా ? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.