టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ “గల్లీ రౌడీ”. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా ‘గల్లీ రౌడీ’ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. ఇక థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. అయితే.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జరిగింది.
ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. హీరో సందీప్ కిషన్ చాలా యాక్టివ్ గా ఉంటాడని.. తన కంటే చాలా సీనియర్ అని తెలిపారు. కోన వెంకట్ ఓ హిట్ ఫ్యాక్టరీ అని… ఆయన ఏ సినిమా చేసినా… బంపర్ హిట్ అని విశ్వక్ సేన్ తెలిపారు. ఇక ‘గల్లీ రౌడీ’ సినిమాలో ఐటెం సాంగే.. హైలేట్ అని చెప్పారు. ఇక అంతకు ముందు గల్లీ రౌడీ సినిమా టీజర్ ను విడుదల చేశారు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా సందీప్ కిషన్ తో ఉన్న అనుబంధాన్ని వివరించారు. లాక్ డౌన్ సమయంలో మేం ఇద్దరం జిమ్ చేసేవాళ్లమన్నారు. ఇక గల్లీ రౌడీ పెద్ద హిట్ కొడుతుందని… ప్రేక్షకులు థియేటర్ల కు వచ్చి చూడాలని కోరారు. గల్లీ రౌడీ టీం కు కృతజ్ఞతలు తెలిపారు దేవర కొండ.