మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ప్రేమగా ‘స్టేట్ రౌడీ’ అని గతంలో పిలుచుకునే వారు. ఆ పేరుతో ఆయన ఓ సినిమాలో నటించడమే అందుకు కారణం. ఇంతకూ విషయం ఏమిటంటే… అలనాటి ఆ ‘స్టేట్ రౌడీ’… ఇప్పుడు ‘గల్లీ రౌడీ’ మూవీ ట్రైలర్ ను ఆవిష్కరించడానికి అంగీకారం తెలిపారు. సందీప్ కిషన్ హీరోగా వైయస్ఆర్ సీపీ పార్లమెంట్ మెంబర్ ఎం.వి.వి. సత్యనారాయణ, ప్రముఖ రచయిత కోన వెంకట్ ‘గల్లీ రౌడీ’ మూవీని నిర్మించారు. సెప్టెంబర్ 17న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 11వ తేదీ చిరంజీవి ఆవిష్కరించబోతున్నారు. ఆయన్ని నిర్మాతలు ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ కలిసి, తమ కోరిక తెలుపుగానే చిరంజీవి ఆమోదముద్ర వేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా మెగాస్టార్ ను ఈ చిత్ర నిర్మాతలిద్దరూ సత్కరించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ఫోటోలు హీరో సందీప్ కిషన్ ట్వీట్ చేస్తూ, తన హర్షాన్ని వెలిబుచ్చాడు. ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని జి. నాగేశ్వరరెడ్డి డైరెక్ట్ చేశారు.
Super Excited to Announce that
— Sundeep Kishan (@sundeepkishan) September 7, 2021
“MegaStar” Chiranjeevi Garu
will be Launching the Theatrical Trailer of #GullyRowdy
On the 11th of September ❤️#MasalaEntertainment Begins in theatres this this 17th 😁#GullyRowdy on 17th September.. pic.twitter.com/JeAIoYrnFR